MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/nikhil-birthday18719d0b-46d0-4aa8-9899-11a7cf653df2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/nikhil-birthday18719d0b-46d0-4aa8-9899-11a7cf653df2-415x250-IndiaHerald.jpgతెలుగు యువ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. గత లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మన నిఖిల్ లో సేవాగుణం కూడా ఉందని మొన్న చేసిన సహాయక చర్యలను బట్టి చెప్పవచ్చు.NIKHIL-BIRTHDAY{#}Telugu;Hero;Josh;marriage;Yuva;police;Posters;Cinema;chandoo mondeti;Love Story;Love;Kathanam;Director;prema;Audience;Palnati Surya Pratapఆ సీన్లలో నటించేటప్పుడు నా భార్యను ఊహించుకున్నా : నిఖిల్ఆ సీన్లలో నటించేటప్పుడు నా భార్యను ఊహించుకున్నా : నిఖిల్NIKHIL-BIRTHDAY{#}Telugu;Hero;Josh;marriage;Yuva;police;Posters;Cinema;chandoo mondeti;Love Story;Love;Kathanam;Director;prema;Audience;Palnati Surya PratapTue, 01 Jun 2021 19:00:00 GMTతెలుగు యువ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. గత లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మన నిఖిల్ లో సేవాగుణం కూడా ఉందని మొన్న చేసిన సహాయక చర్యలను బట్టి చెప్పవచ్చు. ఒక వ్యక్తి  రెండేసీవీర్ ఇంజక్షన్ దొరక్క ఇబ్బంది పడుతుంటే, వారు చేసిన మెసేజ్ కి స్పందించి వెంటనే వారికి సహాయం చేశాడు. గత వారంలో కూడా కరోనా రోగులకు మెడిసిన్ అందించాడు. ఈ క్రమంలోనే పోలీసులు నిఖిల్ వాహనాన్ని ఆపిన సంగతి తెలిసిందే. ఇలా తనలోనూ ఒక సేవకుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. కాగా ఈ రోజు నిఖిల్ తన పుట్టినరోజును జరుపుకున్నాడు.
 ఇందులో భాగంగా నిఖిల్ చేస్తున్న వరుస సినిమాలకు సంబంధిచిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఒకటి "కార్తికేయ 2". ఈ సినిమా సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. మరొకటి "18 పేజెస్". నిఖిల్ తన సినిమా కెరీర్ లో ఇప్పటి వరకు పూర్తి స్థాయి ప్రేమకథలో నటించలేదు. అయితే "18 పేజెస్" సినిమా విషయానికొస్తే ఇది ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా గురించి నిఖిల్ మాట్లాడుతూ నాకు లవ్ స్టోరీస్ మీద పెద్దగా నమ్మకం ఉండదు, అందుకే ఇప్పటి వరకు ఆ తరహా సినిమాలు చేయలేదు.
 
కానీ ఈ సినిమాకు కథ మరియు కథనం అందిస్తున్న డైరెక్టర్ సుకుమార్ ఉన్నారు కాబట్టి ఇది చేస్తున్నా అన్నారు. ఈ సినిమా షూటింగులో కొన్ని ప్రేమ సన్నివేశాలలో నటించాలంటే నా వల్ల కాలేదు, అటువంటి సమయంలో నా భార్యను  తలుచుకుని నటించాను అంటూ నవ్వేశాడు. ప్రేక్షకులు నా నుంచి ఏమి కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి అని ముగించారు. కాగా ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నిఖిల్ కు మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనకు కరోనా వచ్చిందని..కావాలనే కోడలిని కౌగలించుకున్న అత్త..చివరికి.. ?

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>