PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-plans-to-suspend-etela-rajender-from-partyc0a67480-c1fe-48cb-aafc-f5856c6a7a8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-plans-to-suspend-etela-rajender-from-partyc0a67480-c1fe-48cb-aafc-f5856c6a7a8b-415x250-IndiaHerald.jpgఈట‌ల వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తోంది. అసైన్డ్ భూములు క‌బ్జాచేశార‌న్నఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో పాటు ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. అప్ప‌టి నుంచి ఈట‌ల వ‌ర్సెస్ సీఎం కేసీఆర్ అన్న‌ట్లు రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ ఎస్‌ను వీడి కొత్త పార్టీ పెడుతార‌న్న ప్ర‌చారం సాగింది. దీంతో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల వెంట తెరాస కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ వెళ్ల‌కుండా పార్టీ అధిష్టానం క‌ట్ట‌డిచేసింది. అనుచ‌రులుసైతం కేసీఆర్ నిర్ణ‌etela rajender{#}రాజీనామా;Telangana;CM;Minister;Party;Huzurabad;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata Party;MLA;Delhiఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?etela rajender{#}రాజీనామా;Telangana;CM;Minister;Party;Huzurabad;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata Party;MLA;DelhiTue, 01 Jun 2021 17:29:35 GMTమంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకొనేందుకు తెరాస పార్టీ అధిష్టానం సిద్ధ‌మ‌వున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతోపాటు బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డంతో సీఎం కేసీఆర్ ఈట‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో ఈట‌ల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకొనేందుకు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఒక‌టిరెండు రోజుల్లో స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిని క‌లిసి తెరాస నేత‌లు ఆ మేర‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల‌తో పాటు బీజేపీ నేత‌ల‌తో భేటీ అయిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ర‌వీంద‌ర్‌రెడ్డి, ప‌లువురు తెరాస నేత‌ల‌పై  చ‌ర్య‌లు తీసుకొనేందుకు కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ఈట‌ల వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తోంది. అసైన్డ్ భూములు క‌బ్జాచేశార‌న్నఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో పాటు ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. అప్ప‌టి నుంచి ఈట‌ల వ‌ర్సెస్ సీఎం కేసీఆర్ అన్న‌ట్లు రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్‌ను వీడి కొత్త పార్టీ పెడుతార‌న్న ప్ర‌చారం సాగింది. దీంతో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల వెంట తెరాస కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ వెళ్ల‌కుండా పార్టీ అధిష్టానం క‌ట్ట‌డిచేసింది. అనుచ‌రులుసైతం కేసీఆర్ నిర్ణ‌య‌మే శిరోధార్యం అంటూ పేర్కొన‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల బ‌లం త‌గ్గుకుంటూ వ‌స్తోంది. సొంత పార్టీకంటే బీజేపీలో చేరేందుకు ఈట‌ల నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో గ‌త వారం రోజులుగా బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో ఆయ‌న భేటీ అవుతున్నారు.

సోమ‌వారం ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను క‌లిశారు. ఈ మేర‌కు రెండుమూడు రోజుల్లో ఆయ‌న తెరాస‌ను వీడి బీజేపీలో చేరేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డంతో ఆగ్ర‌హంతో ఉన్న సీఎం కేసీఆర్ అన‌ర్హ‌త వేటు వేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఈట‌ల పార్టీకి రాజీనామా చేస్తార‌ని భావించారు. కానీ ఈట‌ల ఆమేర‌కు ముందుకెళ్ల‌క‌పోవ‌డంతో పాటు ప్ర‌స్తుతం బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డంతో శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ స్పీక‌ర్‌కు తెరాస నేత‌లు ఫిర్యాదు చేయ‌నున్నారు. రెండు మూడు రోజుల్లో స్పీక‌ర్‌ను క‌లిసి ఈ మేర‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

స్పోర్ట్స్ : ఒకప్పుడు రోహిత్ శర్మ ను కాదనుకున్న చెన్నై..

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>