MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5912dd1b-f135-493c-ab80-973800e5f369-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5912dd1b-f135-493c-ab80-973800e5f369-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ గురించి ఇపుడు గట్టిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దేశంలో బాలీవుడ్ తో సరిసమానంగా రాణిస్తోంది. అక్కడ ఖాన్ త్రయానికే దడ పుట్టిస్తోంది. టాలీవుడ్ నుంచి వరసపెట్టి తయారవుతున్న పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ చూస్తే చాలు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తెలుగు సినిమా చేసే కంట్రిబ్యూషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది. tollywood{#}Tollywood;bollywood;India;Telugu;Cinema;Santosham;Christmas;festivalమిగిలింది ఏడు నెలలే.... ?మిగిలింది ఏడు నెలలే.... ?tollywood{#}Tollywood;bollywood;India;Telugu;Cinema;Santosham;Christmas;festivalTue, 01 Jun 2021 19:00:00 GMTటాలీవుడ్ గురించి ఇపుడు గట్టిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దేశంలో బాలీవుడ్ తో సరిసమానంగా రాణిస్తోంది. అక్కడ ఖాన్ త్రయానికే దడ పుట్టిస్తోంది. టాలీవుడ్ నుంచి వరసపెట్టి తయారవుతున్న పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ చూస్తే చాలు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తెలుగు సినిమా చేసే కంట్రిబ్యూషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది.

సరే కరోనా కారణంగా వరసగా రెండేళ్ల  సినిమా క్యాలండర్ పోయింది. టాలీవుడ్ లో పరిస్థితులు అన్నీ కూడా తల్లకిందులు అయ్యాయి. టాలీవుడ్ లో ఇపుడు  సినిమా సందడి అయితే కనిపించడంలేదు. రెండవ దశ కరోనా క్రమంగా తగ్గుతున్న నేపధ్యంలో మళ్లీ యాక్టివిటీ పుంజుకుంటే  తప్ప టాలీవుడ్ బండి ముందుకు కదలదు.

అయితే చూస్తూండగానే 2021లో ఏకంగా అయిదు నెలలు కరిగిపోయాయి. మొదటి మూడు నెలలు మాత్రమే టాలీవుడ్ కి ఓ మాదిరిగా సంతోషం దొరికింది. కొన్ని సినిమాలు రిలీజ్ అయి హిట్ అయ్యాయి. సరే ఈ సమ్మర్ లో మొత్తానికి మొత్తంపాత  బాకీని రాబట్టుకోవచ్చు అనుకుంటే కరోనా వల్ల అది కాకుండా పోయింది. అయితే ఇపుడు లక్ ఏంటి అంటే కరోనా నెమ్మదించడం. దాంతో టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాదే చాలా సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంటే అసలైన సందడి ఆగస్టు నుంచి మొదలు కావచ్చునని అంటున్నారు. ఇక దసరాకు పెద్ద సినిమాలతో యుద్ధమే అంటున్నారు. అలాగే దీపావళి, క్రిస్మస్ ఇలా ఏ పండుగ సీజన్, మరే  ఏ అవకాశం వచ్చినా వదలుకోకూడదని కూడా టాలీవుడ్ మేకర్స్ గట్టిగా డిసైడ్ అయ్యారు. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా 2021 ఆరాటపెడుతోంది. మరి కరోనా నెమ్మదించి పూర్తిగా సీన్ అనుకూలం అయితనే బొమ్మ తెర మీద పడేది. చూడాలి మరి ఏం జరుగుతుందో. తెలుగు సినిమా జాతకం ఎలా ఉందో అంటున్నారు అంతా.











Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనకు కరోనా వచ్చిందని..కావాలనే కోడలిని కౌగలించుకున్న అత్త..చివరికి.. ?

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>