PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-treatment28bd22b6-15ed-4c02-b196-64d5d2ac646b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-treatment28bd22b6-15ed-4c02-b196-64d5d2ac646b-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ఆసుపత్రిలో బెడ్స్ దొరికాక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక మారుమూల ప్రాంతాల్లోని క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది. Corona treatment{#}Coronavirus;Kathanamఆ రాష్ట్రంలో వేపచెట్ల కిందే కరోనా చికిత్స..!ఆ రాష్ట్రంలో వేపచెట్ల కిందే కరోనా చికిత్స..!Corona treatment{#}Coronavirus;KathanamTue, 01 Jun 2021 21:15:03 GMTదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ఆసుపత్రిలో బెడ్స్ దొరికాక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక మారుమూల ప్రాంతాల్లోని క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది.

ఇక ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డం, ఆస్ప‌త్రులు లేక, డాక్ట‌ర్లు ట్రీట్మెంట్ చేయ‌క‌పోవ‌డంతో క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఓ రిమోట్ ఏరియాకు చెందిన క‌రోనా బాధితులు ఆర్ఎంపీ డాక్ట‌ర్ల సాయంతో  చెట్ల‌కిందే ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాలతో బయ‌ట‌ప‌డుతున్నామని చెబుతున్నారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

స్థానికుల కథనం ప్రకారం.. మారుమూల గ్రామాల్లో సరైన వైద్యు స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో.. ఉత్త‌ర్‌ప్రదేశ్‌ లోని జేవార్ జిల్లాకు చెందిన క‌రోనా బాధితులు చెట్ల‌ కిందే క‌రోనా చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న బాధితులు వేప‌చెట్లు ఉన్న స్థలాన్నే క‌రోనా వార్డులుగా మార్చుకుంటున్నారు. స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్ట‌ర్ల సాయంతో ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాల్ని కాపాడుకుంటున్నారు.

అయితే అక్కడ విచిత్రం ఏంటంటే బాధితుల‌కు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోయిన వెంటనే వేపచెట్ల కింద మంచాలపై ప‌డుకుటుంటున్నారు. దీంతో వెంట‌నే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరిగి ఉపశమనం లభిస్తోందని గ్రామ‌స్తులు చెబుతున్నారు. జేవార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మాజీ ప్రెసిడెంట్  యోగేశ్ త‌ల‌న్ మాట్లాడుతూ.. "మాకు స‌రైన వైద్య స‌దుపాయాలు లేవు. క‌రోనా వ‌చ్చింద‌ని టెస్టులు చేయించుకుందామంటే ఆస్ప‌త్రులు లేవు.

అందుకే మేమంతా ఆరుబ‌య‌ట చెట్ల‌కిందే క‌రోనాకు చికిత్స చేయించుకుంటున్నాం. ఇక ఎవరికైనా ఆక్సిజ‌న్ స‌మ‌స్య ఎదురైతే వేప‌చెట్ల కింద‌నే ప‌డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరిగినట్లు చాలా మంది చెబుతున్నారు’’ అని తెలిపారు. ఇక ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి గ్రామాల్లో వైద్య‌స‌దుపాయాల ఏర్పాటుకు కృషి చేయాల‌ని గ్రామస్తులు కోరుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>