
టెక్నాలజీ బయోలాజికల్‌కు
ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌లో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఫార్ములాను ప్రావిడెన్స్ థెరాపాటిక్స్ కంపెనీ యాజమాన్యం.. బయోలాజికల్ ఈ సంస్థకు అందజేస్తుంది. 2022 నాటికి కనీసం ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను బయోలాజికల్ ఈ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీనితోపాటు- నార్త్ అమెరికా ప్రజల అవసరాలు తీరిన తరువాత 30 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ప్రావిడెన్స్.. భారత్‌కు ఎగుమతి చేస్తుంది.

క్లినికల్ ట్రయల్స్ సహా..
భారత్ వరకూ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలు, ఇతర కార్యకలాపాలను బయోలాజికల్ ఈ లిమిటెడ్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందులో కెనడా కంపెనీ జోక్యం చేసుకోదు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం, క్లినికల్ డెవలప్‌మెంట్స్, రెగ్యులేటరీ యాక్టివిటీస్, ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవడం వంటి కార్యక్రమాలన్నింటినీ హైదరాబాదీ ఫార్మా కంపెనీనే చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక లావాదేవీలను వెల్లడించకూడదనే నిబంధన ఉంది.

ఫస్ట్ బ్యాచ్ కెనడాకే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ కరోనా వైరస్ నిర్మూలనలో ఫ్రంట్ రన్నర్‌గా ఉండటం ఖాయమని బయోలాజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లా వ్యాఖ్యానించారు. భారత్ సహా ఇతర దేశాలకు ఇదొక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుందని చెప్పారు. తాము తయారు చేసిన తొలి వ్యాక్సిన్లను కెనడాకు పంపిస్తామని పేర్కొన్నారు. మనిటోబా ప్రావిన్స్‌లో వాటిని వినియోగించాలని ప్రావిడెన్స్ థెరాపాటిక్స్ భావిస్తోందని చెప్పారు. మున్ముందు- ఈ వ్యాక్సిన్.. దేశంలో నెలకొన్న కొరతను తీర్చగలదనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

ఫైజర్, మోడెర్నా తరహాలో..
కరోనా వైరస్ జన్యు క్రమంలోని కొంత భాగాన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ తయారీలో ఉపయోగిస్తారు. దానిని శరీరంలోకి పంపించటం ద్వారా వైరల్ ప్రొటీన్లు తయారయ్యేలా చేస్తుంది. ఈ వైరల్ ప్రొటీన్లు కరోనా అసలు వైరస్‌ను నిర్మూలిస్తాయి. రోగనిరోధకశక్తిని రెట్టింపు చేయడానికి అవసరమయ్య స్థాయిలో వైరల్ ప్రొటీన్లు ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం భారత్‌లో ఈ తరహా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా మాత్రమే ఈ తరహా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. కెనడా కంపెనీ ప్రావిడెన్స్ కూడా దాన్ని అభివృద్ధి చేసింది. ఆ టెక్నాలజీని బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు బదలాయించనుంది.