MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-movielo-tharun-indhulo-nijamenthad3664a35-6838-41fd-bc8b-f042586ef836-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-movielo-tharun-indhulo-nijamenthad3664a35-6838-41fd-bc8b-f042586ef836-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కూడా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి నెలకొంది. ఇందులో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని పాత్ర చేస్తుండడంతో సినిమా ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది.PUSHPA MOVIE GOSSIP{#}tarun;Tarun Kumar;Telugu;Allu Arjun;Cinema;sukumar;India;Tollywood;Hero;Athidhi;Directorపుష్ప మూవీలో తరుణ్ ? ఇందులో నిజమెంత ?పుష్ప మూవీలో తరుణ్ ? ఇందులో నిజమెంత ?PUSHPA MOVIE GOSSIP{#}tarun;Tarun Kumar;Telugu;Allu Arjun;Cinema;sukumar;India;Tollywood;Hero;Athidhi;DirectorTue, 01 Jun 2021 12:30:00 GMTప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కూడా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి నెలకొంది. ఇందులో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని పాత్ర చేస్తుండడంతో సినిమా ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరున్న హీరో తరుణ్ ఈ సినిమాలో భాగం అవబోతున్నాడనే వార్త బయట ప్రచారంలో ఉంది.

అసలు వివరాల్లోకి వెళితే, ఈ సినిమాలో మళయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున విషయం తెలిసిందే. ఈయన పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడానికి తరుణ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ అవకాశం తరుణ్ కి ఎలా వచ్చిందో తెలుసా ? మలయాళంలో విడుదలయి విజయాన్ని సొంతం చేసుకున్న అనుకోని అతిధి మూవీని తెలుగులో డబ్ చేసి గత వారమే విడుదల చేశారు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ పాత్రకు అనుకోకుండా తరుణ్ చేత డబ్బింగ్ చెప్పించారు. తరుణ్ చెప్పిన డబ్బింగ్ చాలా బాగా రావడంతో, పుష్ప సినిమాకి కూడా తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పించాలని డైరెక్టర్ సుకుమార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇలా తరుణ్ కూడా పుష్ప సినిమాలో ఒక భాగం కానున్నాడు. దీనితో తరుణ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పుష్ప సినిమాలో తరుణ్ కనబడకపోయినా కనీసం వినబడుతాడని హ్యాపీ ఫీలు అవుతున్నారు. ఈ సినిమా కూడా డబ్బింగ్ పరంగా తరుణ్ కి మంచి పేరు తీసుకువస్తే, రానున్న రోజుల్లో విలన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకుంటూ తరుణ్ స్థిరపడనున్నాడా ? లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం పుష్ప షూటింగు చివరి దశలో ఉంది. కరోనా కారణంగా అన్ని సినిమా షూటింగులు ఆగిపోయాయి.  

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పన్ను నొప్పిని అశ్రద్ధ చేస్తున్నారా..?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>