PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/anandayya-medicine-ayurveda-medicine-krishnapatnam-medicine-f7bf32c6-652f-4ac2-bd83-9d72bd7337da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/anandayya-medicine-ayurveda-medicine-krishnapatnam-medicine-f7bf32c6-652f-4ac2-bd83-9d72bd7337da-415x250-IndiaHerald.jpgప్రభుత్వ అనుమతి రాకముందు ఆనందయ్య మందు పంపిణీపై వరుసగా పుకార్లు షికార్లు చేశాయి. అదిగో అనుమతులొచ్చేస్తున్నాయి, ఇదిగో మందిచ్చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే ఆనందయ్య మందుకి ప్రభుత్వం అనుమతిచ్చినా, కోర్టు మందు పంపిణీ వెంటనే చేపట్టాలని కోరినా.. కొన్నిరోజులు ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. సోమవారం ఆదేశాలు వెలువడ్డ తర్వాత మంగళవారం నుంచి మందు పంపిణీ మొదలు కావాల్సి ఉంది. కానీ మరో మూడు నాలుగు రోజులు సమయం పట్టేట్టు కనిపిస్తోంది. anandayya medicine, ayurveda medicine, krishnapatnam medicine,{#}Government;court;monday;tuesday;Krishnapatnam Port;MLA;Nellore;Ayurveda;Tirumala Tirupathi Devasthanamఆనందయ్య మందుకోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే..ఆనందయ్య మందుకోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే..anandayya medicine, ayurveda medicine, krishnapatnam medicine,{#}Government;court;monday;tuesday;Krishnapatnam Port;MLA;Nellore;Ayurveda;Tirumala Tirupathi DevasthanamTue, 01 Jun 2021 07:00:00 GMTప్రభుత్వ అనుమతి రాకముందు ఆనందయ్య మందు పంపిణీపై వరుసగా పుకార్లు షికార్లు చేశాయి. అదిగో అనుమతులొచ్చేస్తున్నాయి, ఇదిగో మందిచ్చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే ఆనందయ్య మందుకి ప్రభుత్వం అనుమతిచ్చినా, కోర్టు మందు పంపిణీ వెంటనే చేపట్టాలని కోరినా.. కొన్నిరోజులు ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. సోమవారం ఆదేశాలు వెలువడ్డ తర్వాత మంగళవారం నుంచి మందు పంపిణీ మొదలు కావాల్సి ఉంది. కానీ మరో మూడు నాలుగు రోజులు సమయం పట్టేట్టు కనిపిస్తోంది.

భద్రత కారణాలతో ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టులోని అతిథి గృహంలో ఉన్న ఆనందయ్య.. సోమవారం సాయంత్రం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డితో కలిసి కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు. మందుకు కావాల్సిన వనమూలికలు, దినుసులు సమకూర్చుకునేందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతుందని వారు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఒకేచోట కాకుండా మూడు, నాలుగు కేంద్రాల ద్వారా మందు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నట్టు ఆనందయ్య చెప్పారు.


ఆనందయ్య మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సేకరించాల్సి ఉంది. నెల్లూరు జిల్లా అధికారులతో చర్చించి మందు ఎక్కడ తయారు చేయాలి, ఏ ప్రాంతంలో పంపిణీ చేయాలనే అంశాల్ని నిర్ణయిస్తారు. ఇదంతా పూర్తికావడానికి మూడు, నాలుగు రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తన మందు వల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని పరిశోధన ద్వారా నిరూపితమైందని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తెలిపారు. దినుసులు సేకరించిన తర్వాత పని మొదలు పెడతానన్నారు.

అటు టీటీడీ ఆధ్వర్యంలో కూడా ఆనందయ్య ఫార్ములాతో ఆయుర్వేద మందు తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ తయారీ ప్రక్రియ వద్దకు ఆనందయ్యను తీసుకెళ్తారా లేక, కేవలం ఫార్ములా తెలుసుకుని పని పూర్తి చేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. ఏదేమైనా.. ఆనందయ్య మందుకి అనుమతి వచ్చిన వెంటనే పంపిణీ మొదలవుతుందని ఎదురు చూసిన ప్రజలు నిరాశకు గురయ్యారు. మరో మూడు నాలుగు రోజులు ఆగక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>