SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/tulasi-plant-importance340def73-7ede-4530-92f5-006fc03df458-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/tulasi-plant-importance340def73-7ede-4530-92f5-006fc03df458-415x250-IndiaHerald.jpgతులసి మొక్క హిందు ధర్మశాస్త్రంలో ఎంతో పవిత్రమైన స్థానాన్ని కలిగి ఉంది. లక్ష్మీ దేవి స్వరూపంగా తులసి మొక్కను ఆరాధిస్తారు. హిందువుల ఇళ్ళల్లో తులసి మొక్కను ప్రతిష్టించి నిత్యం పూజలు జరుపుతుంటారు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. TULASI PLANT IMPORTANCE{#}thulasi;Tulasi;Hindus;Lakshmi Devi;amrutha;Shakti;krishna;Manam;Mahaతులసి మొక్క మీ ఇంట్లో ఉందా ? ఈ జాగ్రత్తలు పాటించండి ?తులసి మొక్క మీ ఇంట్లో ఉందా ? ఈ జాగ్రత్తలు పాటించండి ?TULASI PLANT IMPORTANCE{#}thulasi;Tulasi;Hindus;Lakshmi Devi;amrutha;Shakti;krishna;Manam;MahaTue, 01 Jun 2021 08:00:00 GMTతులసి మొక్క హిందు ధర్మశాస్త్రంలో ఎంతో పవిత్రమైన స్థానాన్ని కలిగి ఉంది. లక్ష్మీ దేవి స్వరూపంగా తులసి మొక్కను ఆరాధిస్తారు. హిందువుల ఇళ్ళల్లో తులసి మొక్కను ప్రతిష్టించి నిత్యం పూజలు జరుపుతుంటారు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. తులసి మొక్కలో ఓవైపు దైవత్వం కనబడుతుంటే మరో వైపు ఆరోగ్యాన్ని సంరక్షించే అమృత వాణిగా పేరుగాంచింది. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి మొక్కకు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. కానీ తెలిసో తెలియకో క్రింది తప్పులు చేయడం వలన వారికి కష్టాలు తప్పవని అంటున్నారు పండితులు. కాబట్టి అవేంటో తెలుసుకొని ఆ తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది.

* తులసి మొక్క ఎప్పుడూ ఇంటి పెరటి వైపునే ఉండాలి, వీధి గుమ్మం వైపు ఉండరాదు. ఎందుకంటే దైవత్వం కలిగిన తులసి మొక్కకు  నరదృష్టిని గ్రహించే శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మన ఇంటికి తగిలే నరదృష్టి గ్రహించి మన ఇంటి దరిదాపుల్లోకి ఆ కీడు వాటిల్లకుండా ఆపుతుంది.

*  ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసి మొక్కకు నీళ్లు పోయాలి. కంచు చెంబుతో నీటిని తీసుకొని కుడిచేతితో తులసి మొక్కకు నీరు పోయాలి.

* తులసి మొక్కలు రెండు రకాలు ఉంటాయి అన్న విషయం అందరికీ   తెలిసిందే. పచ్చ కొమ్మలు కలిగి ఉన్నది  లక్ష్మి తులసి, నలుపు రంగు కొమ్మలు కలిగి ఉన్నది కృష్ణ తులసి. ఈ రెండు మొక్కలను కలిపి ఒకే కోటలో పెంచడం ద్వారా ఇంటికి మరింత మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

* అపవిత్రమైన స్త్రీలు తులసి మొక్కను తాకరాదు, పొరపాటున కూడా తులసీ దళాలను తుంచకూడదు.

* సాధారణంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించే టప్పుడు తులసి దళాలు దేవుళ్ళ ముందు ఉంచుతాం, తులసిమాలలతో దేవుళ్ళను అలంకరిస్తారు. కానీ మనం నిత్యం పూజ చేసే తులసి మొక్క నుండి మాత్రం తులసీ దళాలను తుంచరాదు, ఇది మహా పాపం.

ఈ తప్పులను జరగకుండా చూసుకోవాలి అప్పుడే ఆ లక్ష్మీ కటాక్షం మనపై ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>