PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kashmiradd2c710-cef3-4c5e-a89a-539c6d27e6aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kashmiradd2c710-cef3-4c5e-a89a-539c6d27e6aa-415x250-IndiaHerald.jpgభారత అంతర్భాగమైన కాశ్మీర్‌లో నాడు ఉన్న పరిస్థితులు నేడు లేవు. కాశ్మీర్‌పై ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాశ్మీర్‌లో అల్లర్లు, బాంబు పేలుళ్లు ఇలా మరెన్నో అరాచకాలకు పాల్పడింది. భారత్‌పై తీవ్రవాదులను ఉసిగొల్పుతూ ఎందరో యువకులను తీవ్రవాదులుగా మార్చింది. వారంతా కాశ్మీర్‌లోనే తలదాచుకుంటూ తమ తీవ్రవాద కార్య కలాపాలను చేసుకుంటూ వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం..kashmir{#}Pakistan;central government;Army;Jammu and Kashmir - Srinagar/Jammu;commander;Newsకాశ్మీరీ యువతే టార్గెట్.. రంగంలోకి భారత సైన్యం..కాశ్మీరీ యువతే టార్గెట్.. రంగంలోకి భారత సైన్యం..kashmir{#}Pakistan;central government;Army;Jammu and Kashmir - Srinagar/Jammu;commander;NewsTue, 01 Jun 2021 16:22:41 GMTభారత అంతర్భాగమైన కాశ్మీర్‌లో నాడు ఉన్న పరిస్థితులు నేడు లేవు. కాశ్మీర్‌పై ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాశ్మీర్‌లో అల్లర్లు, బాంబు పేలుళ్లు ఇలా మరెన్నో అరాచకాలకు పాల్పడింది. భారత్‌పై తీవ్రవాదులను ఉసిగొల్పుతూ ఎందరో యువకులను తీవ్రవాదులుగా మార్చింది. వారంతా కాశ్మీర్‌లోనే తలదాచుకుంటూ తమ తీవ్రవాద కార్య కలాపాలను చేసుకుంటూ వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం కాశ్మీ‌ర్‌లో ఆర్టికల్ 35ఏ రద్దు తరువాత కాశ్మీర్, లడక్, జమ్ము ప్రాంతాల్లోని తీవ్రవాదుల ఏరివేతను చేపట్టింది. ఇందులో భాగంగా జరిగిన కాల్పుల్లో ఎంతోమంది తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.భారత్ దెబ్బకు తీవ్రవాదులు చిల్లపెంకుల్లా పారిపోయారు. వారిలో అధిక శాతం మంది తమ స్వదేశానికి పారిపోయారు. అయితే అప్పుడప్పుడే తీవ్రవాదంలో అడుగుపెట్టిన కాశ్మీరీ యువతను మిలటరీ అదుపులోకి తీసుకుంది. తన అదుపులో ఉన్న కాశ్మీరీ యువతకు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. కౌన్సిలింగ్‌లో భాగంగా మరోసారి తీవ్రవాద మనోభావాలను దరిచేరనివ్వొద్దని, దాని వల్ల మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. వీటితో పాటుగా తీవ్రవాదులు తమ కార్యకలాపాల కోసం దాచిపెట్టుకున్న మందుగుండు సామాగ్రిని అనేక ప్రదేశాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి మరిన్ని చర్యలతో కాశ్మీర్‌లోని తీవ్రవాదాన్ని దాదాపుగా కనుమరుగు చేశారు.దాంతో ఇదివరకటిలా కాశ్మీర్‌లో భారత సైన్యంపై కానీ, పోలీసులపై కాని ఎటువంటి దాడులు జరగడం లేదు. దాదాపు 90శాతం కాశ్మీర్ శాంతి భద్రతలకు చిహ్నంగా ఉంది. అయితే ఇప్పటికీ అక్కడే నివశిస్తున్న కొందరు స్లీపర్ సెల్స్ కాశ్మీర్‌లో మళ్లీ తీవ్రవాద బీజాలు నాటేందుకు చూస్తున్నారు. ఇందులో భాగంగా కాశ్మీరీ యువతనే మళ్లీ తమ పావులుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్‌బదర్ అనే ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ హంజా బుర్హాన్ ఇప్పుడు మళ్లీ కాశ్మీర్ యువతను రెచ్చగొట్టి తీవ్రవాద కార్యకలాపాలను నడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సమాచారం అందడంతో భారత సైన్యం అతడికోసం వెతుకులాట ప్రారంభించింది. ఎన్నాళ్లలో అతడిని పట్టుకుంటారో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

స్పోర్ట్స్ : ఒకప్పుడు రోహిత్ శర్మ ను కాదనుకున్న చెన్నై..

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>