PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpe0571835-0599-4ef0-9750-b627fc13bb06-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpe0571835-0599-4ef0-9750-b627fc13bb06-415x250-IndiaHerald.jpgతమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ మొదట నుంచి రూల్ పెట్టుకుని ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. వైసీపీ ద్వారా గెలిచి పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్లారు. అందులో నలుగురు మంత్రులుగా కూడా పనిచేశారు.ysrcp{#}రాజీనామా;Jagan;TDP;MP;Turmeric;YCP;gannavaram;Vallabhaneni Vamsi;vamsi;chirala;Guntur;MLA;Vishakapatnam;Electionsఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?ysrcp{#}రాజీనామా;Jagan;TDP;MP;Turmeric;YCP;gannavaram;Vallabhaneni Vamsi;vamsi;chirala;Guntur;MLA;Vishakapatnam;ElectionsTue, 01 Jun 2021 15:00:00 GMTతమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ మొదట నుంచి రూల్ పెట్టుకుని ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. వైసీపీ ద్వారా గెలిచి పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్లారు. అందులో నలుగురు మంత్రులుగా కూడా పనిచేశారు.


అయితే జగన్ మాత్రం తమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని రూల్ పెట్టారు. ఆ రూల్ ప్రకారమే పలువురు పదవులు వదిలి వైసీపీలోకి వచ్చారు. ఇక 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో సైలెంట్ అయ్యారు. కానీ గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసి, అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకుండా జగన్‌కు మద్ధతు తెలిపారు.


అంటే వంశీ టీడీపీలో లేరు కానీ, అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం రాలేదు. వంశీ బాటలోనే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌లు టీడీపీని వీడి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు అనే విషయంపై క్లారిటీ లేదు. కావాలంటే పదవులకు రాజీనామా చేసి, వైసీపీ తరుపున బరిలో దిగడానికి నలుగురు సిద్ధంగా ఉన్నట్లే తెలుస్తోంది.


పైగా రాష్ట్రంలో జగన్ వేవ్ బాగా ఉంది. దీంతో వారి గెలుపుకు ఎలాంటి ఢోకా ఉండదని అర్ధమవుతుంది. మరి వారి రాజీనామాల విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కరోనా సమయం కావడంతో ఎన్నికలు ఇప్పటిలో పెట్టే పరిస్తితి లేదు. అయితే భవిష్యత్‌లో ఇంకా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వస్తే, అందరితో ఒక్కసారే రాజీనామా చేయించి జగన్ ఎన్నికలకు వెళ్తారేమో చూడాలి. లేదు అంటే ఇలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా కథ నడిపిస్తారేమో





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అంతా భ‌విష్య‌త్‌లోనేనా..? ఇప్పుడేం చేయ‌రా...? కేసీఆర్ స‌ర్కార్‌పై హైకోర్ట్ సీరియ‌స్‌

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>