PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp126d831b-2970-4a7f-beb0-eb122d3d5764-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp126d831b-2970-4a7f-beb0-eb122d3d5764-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా వినుకొండలో రాజకీయాలు వేడెక్కాయి. గత కొన్నిరోజులుగా వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కరోనా రోగులకు ఉచితంగా ఆహారం అందిస్తున్న శివశక్తి సంస్థని ఎమ్మెల్యే అడ్డుకోవడంతో అసలు సమస్య మొదలైంది. అయితే ఇటీవల వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నారు. అయితే తక్షణమే శివశక్తి ఫౌండేషన్ సభ్యులను భోజనం పంపిణీ నిలిపివేయాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా పోలీసTDP{#}Guntur;politics;YCP;TDP;war;MLA;Vinukonda;District;police;Service;Shiva;lord siva;Racchaజీవీ వర్సెస్ బొల్లా: వినుకొండలో రచ్చ...రాజకీయం ఎవరిది?జీవీ వర్సెస్ బొల్లా: వినుకొండలో రచ్చ...రాజకీయం ఎవరిది?TDP{#}Guntur;politics;YCP;TDP;war;MLA;Vinukonda;District;police;Service;Shiva;lord siva;RacchaTue, 01 Jun 2021 00:00:00 GMTగుంటూరు జిల్లా వినుకొండలో రాజకీయాలు వేడెక్కాయి. గత కొన్నిరోజులుగా వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కరోనా రోగులకు ఉచితంగా ఆహారం అందిస్తున్న శివశక్తి సంస్థని ఎమ్మెల్యే అడ్డుకోవడంతో అసలు సమస్య మొదలైంది. అయితే ఇటీవల వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నారు. అయితే తక్షణమే శివశక్తి ఫౌండేషన్ సభ్యులను భోజనం పంపిణీ నిలిపివేయాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా పోలీసులు వెళ్లి భోజనం పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. భోజనం పంపిణీ చేస్తున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



అయితే పేదలకు ఉచితంగా ఆహారం అందిస్తున్న శివశక్తి ఫౌండేషన్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జీవీ ఆంజనేయులుకు సంబంధించింది. అందుకే ఎమ్మెల్యే ఆ సంస్థకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. అయితే శివశక్తికి డబ్బులు ఎక్కడ వస్తున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేకు ధీటుగా జీవీ కూడా స్పందిస్తూ, వినుకొండ ప్రజలకు 23 ఏళ్లుగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండేషన్‌పై ఆరోపణలు నిరూపించాలని, కావాలంటే దేవుడు మీద ప్రమాణం చేయడానికి రావాలని జీవీ సవాల్ కూడా విసిరారు.



ఈ క్రమంలోనే దేవుడు మీద ప్రమాణం చేయడానికి వెళుతున్న జీవీని పోలీసులు ఆపేశారు. ఇక శివశక్తి పౌండేషన్ బ్యాలెన్స్ షీట్లు బయటపెట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. శివశక్తికి ఎక్కడ నుంచి నిధులు వస్తున్నాయో లెక్కలు చూపకుండా ప్రమాణాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆంజనేయులుది అంతా తొండి వ్యవహారమని ఎమ్మెల్యే మండిపడుతున్నారు.



అసలు కోవిడ్ రోగులకు సేవ చేస్తున్న శివ శక్తి ఫౌండేషన్ పై ఎమ్మెల్యే తీరు దుర్మార్గమని, అధికారులు బంట్రోతుల్లా పని చేయడం మానుకోవాలని టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడుతున్నారు. ఈ విధంగా వినుకొండలో వైసీపీ-టీడీపీలు రాజకీయ రచ్చ లేపుతున్నాయి. కాకపోతే ప్రజలకు ఉచితంగా ఆహారం అందించే కార్యక్రమం అడ్డుకోవడం కరెక్ట్ కాదని న్యూట్రల్ వ్యక్తులు అభిప్రాయ పడుతున్నారు. శివశక్తి ఏమన్నా తప్పు చేస్తే, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఏదేమైనా వినుకొండలో రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నట్లే కనిపిస్తోంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??

భారతీయ సినిమాకి ఆల్ టైం సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పిక్స్ వైరల్..

రాత్రే ఆ పాలు ఎందుకు తాగాలో తెలుసా ?

పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>