MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allusirish-cca5d676-b034-45ea-b631-d752e66f794b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allusirish-cca5d676-b034-45ea-b631-d752e66f794b-415x250-IndiaHerald.jpg అల్లు కాంపౌండ్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లు శిరీష్ సెటిల్ అవ్వలేకపోతున్నాడు. అతడి కెరియర్ లో ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఒక్క 'శ్రీరస్తు శుభమస్తు' మినహా మరే సినిమా హిట్ కాలేదు. 2019 లో వచ్చిన ‘ఏబీసీడీ’ తరువాత శిరీష్ చాల మౌనంగా ఉంటున్నాడు. ఈమధ్య ‘విలాయటి శరాబ్’ అనే హిందీ మ్యూజిక్ వీడియోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి శిరీష్ తనవంతు ప్రయత్నాలు చేసాడు. ఇలాంటి పరిస్థితులలో ఇతడు చాల సీక్రెట్ గా ఒక సినిమాను ప్రారంభించి ఇంచుమించు పూర్తి చేసాడు అన్న వార్తలు వస్తున్నallusirish;{#}2019;Industry;allu sirish;Cinema;Hindi;News;Love;Romantic;Iron;Heroine;Hero;premaఅల్లు శిరీష్ రొమాన్స్ కు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !అల్లు శిరీష్ రొమాన్స్ కు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !allusirish;{#}2019;Industry;allu sirish;Cinema;Hindi;News;Love;Romantic;Iron;Heroine;Hero;premaTue, 01 Jun 2021 08:00:00 GMT
అల్లు కాంపౌండ్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లు శిరీష్ సెటిల్ అవ్వలేకపోతున్నాడు. అతడి కెరియర్ లో ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఒక్క 'శ్రీరస్తు శుభమస్తు' మినహా మరే సినిమా హిట్ కాలేదు. 2019 లో వచ్చిన ‘ఏబీసీడీ’ తరువాత శిరీష్ చాల మౌనంగా ఉంటున్నాడు.



ఈమధ్య ‘విలాయటి శరాబ్’ అనే హిందీ మ్యూజిక్ వీడియోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి శిరీష్ తనవంతు ప్రయత్నాలు చేసాడు. ఇలాంటి పరిస్థితులలో ఇతడు చాల సీక్రెట్ గా ఒక సినిమాను ప్రారంభించి ఇంచుమించు పూర్తి చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం తన మేకోవర్ కూడ చాల మార్చుకున్నాడట.


తెలుస్తున్న సమాచారం మేరకు శిరీష్ డిఫరెంట్ లవ్ స్టోరీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా #SIRISH6 ప్రాజెక్ట్ కి సంబంధించిన అనౌన్సమెంట్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఒక రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేసి చేతులు అడ్డుపెట్టి ముద్దు పెట్టుకుంటున్నాడు. దీనితో శిరీష్ లో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్రపడిన అను ఇమ్మాన్యుల్ ఈ మూవీలో నటిస్తోంది.


అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు #SIRISH6 సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఒక ఫెయిల్యూర్ హీరో మరొక ఫెయిల్యూర్ హీరోయిన్ తో కలిసి ఒక వెరైటీ ప్రేమ కథలో నటిస్తూ ఉండటం ఇక్కడి ట్విస్ట్. ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే తనకు హాబీగా ఉన్న జాతకాలు ముహూర్తాల విషంలో పరిశోధన కొనసాగిస్తూ తన తండ్రికి చేదోడువాదోడు గా ఆహా వ్యాపార కార్యకలాపాలలో కూడ శిరీష్ ప్రస్తుతం చాల బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో అయినా శిరీష్ సక్సస్ కొట్టాలి అన్న కోరిక తీరుతుందో లేదో చూడాలి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>