MoviesThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-birthday-nikhilcb20d667-5a68-4fa9-83b1-23a1b1e126e1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-birthday-nikhilcb20d667-5a68-4fa9-83b1-23a1b1e126e1-415x250-IndiaHerald.jpgసూర్య‌ప‌త్రాప్ ప‌ల్నాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న 18 పేజ‌స్ చిత్రంలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జూన్‌1న నిఖిల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది. టైటిల్‌తోనే సినిమాపైన ఇప్ప‌టికే ఫుల్ క్రేజ్ ఏర్ప‌డింది. గీతా ఆర్స్ట్ -2 ప‌తాకంపై బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నిఖిల్ కెరియ‌ర్‌లో బిగెస్ట్ హిట్‌ను ఇచ్చిన కార్తికేయ. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సినిమాలోనూ న‌టిసhappy birthday nikhil{#}Telugu;job;Happy days;Hero;karthikeya;kartikeya;Cinema;Arjunనిఖిల్ చేతిలో ఐదు సినిమాలు .. ! అవేంటో తెలుసా?నిఖిల్ చేతిలో ఐదు సినిమాలు .. ! అవేంటో తెలుసా?happy birthday nikhil{#}Telugu;job;Happy days;Hero;karthikeya;kartikeya;Cinema;ArjunTue, 01 Jun 2021 06:51:00 GMTహ్యాపీడేస్ సినిమాలో త‌న అద్భుత న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని దోచిన నిఖిల్ .. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో అంచెలంచెలుగా ఎదుగుతూ మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించాడు. చిన్న‌త‌నం నుండి సినిమాల‌పై ఫ్యాష‌న్ పెంచుకున్న ఈ హైద‌రాబాదీ కుర్రాడు.. ఇంజ‌నీరింగ్ పూర్త‌యిన వెంట‌నే ఉద్యోగం వేట‌లో ప‌డ‌కుండా సినిమాల వేట‌లో ప‌డిపోయాడు.. 2003లో సంబ‌రం సినిమాలో ఓ చిన్న‌పాత్ర‌లో  క‌నిపించాడు నిఖిల్‌. 2006లో వ‌చ్చిన హైద‌రాబాద్ న‌వాబ్స్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం రావ‌డం, అదే సినిమాలో చిన్న పాత్ర‌లో న‌టించాడు. 2007లో నిఖిల్ రేంజే  ఒక్క‌సారిగా మారిపోయింది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ్యాపీడేస్ సినిమాలో సెకండ్ హీరో పాత్ర‌లో న‌టించి అంద‌రినీ క‌డుపుబ్బా నివ్వించాడు నిఖిల్‌. ఈ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా ఎదిగిపోయాడు.


2008 నుంచి 2010 వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు సినిమాల్లో న‌టించినా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ రాలేదు. 2013లో న‌టించిన స్వామిరారా, 2014లో న‌టించిన కార్తికేయ సినిమాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చినా .. ఆ త‌రువాత న‌టించిన రెండు సినిమాలు నిరాశ‌ప‌ర్చ‌గా.. 2016లో వ‌చ్చిన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత వ‌చ్చిన కేశ‌వ్ నిరాశ‌ప‌ర్చినా, కిరాక్ పార్టీ, అర్జున్ సుర‌వ‌రం సినిమాలు ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టాయి. మొత్తం ప‌ద‌హారు సినిమాల్లో హీరోగా న‌టించిన నిఖిల్‌.. హిట్‌లు, ప్లాప్‌ల‌తో ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు. తాజాగా నిఖిల్ ఐదు సినిమాల్లో న‌టిస్తున్నాడ‌ట‌.


సూర్య‌ప‌త్రాప్ ప‌ల్నాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న 18 పేజ‌స్ చిత్రంలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జూన్‌1న నిఖిల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది.  టైటిల్‌తోనే సినిమాపైన ఇప్ప‌టికే ఫుల్ క్రేజ్ ఏర్ప‌డింది. గీతా ఆర్స్ట్ -2 ప‌తాకంపై బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నిఖిల్ కెరియ‌ర్‌లో బిగెస్ట్ హిట్‌ను ఇచ్చిన కార్తికేయ. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సినిమాలోనూ న‌టిస్తున్నాడు. మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ -2 సినిమా తెర‌కెక్కుతుంది. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాల‌తో పాటు మ‌రో మూడు సినిమాల‌కు నిఖిల్ సైన్ చేశాడ‌ట‌. కొవిడ్ కార‌ణంగా ప్ర‌స్తుతానికి అవేవి సెట్స్ మీద‌కు రాలేదు. లాక్‌డౌన్ త‌రువాత ఆ సినిమాల‌ షూటింగ్‌ల‌లో నిఖిల్ పాల్గోనున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>