MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya70d859d9-41a1-48d2-abbd-95477cfdf131-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya70d859d9-41a1-48d2-abbd-95477cfdf131-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాలయ్య యాక్షన్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్. ఇక స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో ఈ మధ్య కాలంలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.Balayya{#}Cinema;Telugu;Balakrishna;Hero;choudary actor;January;anoushka;Anushka;Bharateeyuduబాలయ్య సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా..?బాలయ్య సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా..?Balayya{#}Cinema;Telugu;Balakrishna;Hero;choudary actor;January;anoushka;Anushka;BharateeyuduTue, 01 Jun 2021 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాలయ్య యాక్షన్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్. ఇక స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో ఈ మధ్య కాలంలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇక బాలయ్య హీరోగా నటిస్తూ భారీ అంచనాలతో రిలీజవుతున్న సినిమాలే ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి.

ఇక బాలకృష్ణ హీరోగా వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కించిన సినిమా ఒక్క మగాడు. ఈ సినిమా 2008 సంవత్సరం జనవరి 10వ తేదీన రిలీజైంది. ఈ సినిమాకు ముందు వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యాయి. అయితే ఒక్కమగాడు మూవీ మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలను మిగిల్చింది. తాజాగా వైవీఎస్ చౌదరి ఒక్కమగాడు మూవీ రిజల్ట్ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అయితే బాలకృష్ణ ఒక్కమగాడు సినిమాకు ముందు వయొలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలలో నటించారని తెలిపారు. ఆ సమయంలో హింస లేకుండా ఒక్కమగాడు సినిమాను తెరకెక్కించడం తన తప్పైందని వైవీఎస్ చౌదరి అన్నారు. ఇక బాలయ్య మూవీ కథ విషయంలో తన ఆలోచన తప్పు కావడంతో ఆ సినిమా ఫ్లాప్ అయిందని వైవీఎస్ చౌదరి వెల్లడించారు.

బాలయ్య సినీ కెరీర్ లో మాత్రం ఒక్కమగాడు అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలవడం గమనార్హం. కాగా, ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా అనుష్క నటించారు. ఈ సినిమా కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాను పోలి ఉందనే కామెంట్లు సైతం అభిమానుల నుంచి వినిపించాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>