EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/raghurama-petition-pi-cbi-maunam-vyuhaatmakama93c3333a-adb4-48a9-8ccf-24dc99808a70-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/raghurama-petition-pi-cbi-maunam-vyuhaatmakama93c3333a-adb4-48a9-8ccf-24dc99808a70-415x250-IndiaHerald.jpgఏపీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేయ‌డం, దాని అనంత‌ర ప‌రిణామాలు రాష్ట్ర రాజ‌కీయాల్లో కాక పుట్టించిన విష‌యం తెలిసిందే. కోర్టు విచార‌ణ స‌మ‌యంలో గ‌తంలో ప‌లు వాయిదాలు కోరిన అనంత‌రం మంగ‌ళ‌వారం సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌ర‌పు న్యాయ‌వాదులు కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. ర‌ఘురామ‌రాజు రాజ‌కీయ దురుద్దేశంతోనే ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశార‌నిCBI-Jagan{#}CBI;Andhra Pradesh;Reddy;MP;court;CM;petitioner;Nijam;Party;Supreme Court;Letter;Jagan;Sambandam;central government;Lawyerర‌ఘురామ పిటిష‌న్‌పై సీబీఐ మౌనం వ్యూహాత్మ‌క‌మా..?ర‌ఘురామ పిటిష‌న్‌పై సీబీఐ మౌనం వ్యూహాత్మ‌క‌మా..?CBI-Jagan{#}CBI;Andhra Pradesh;Reddy;MP;court;CM;petitioner;Nijam;Party;Supreme Court;Letter;Jagan;Sambandam;central government;LawyerTue, 01 Jun 2021 17:29:22 GMTఏపీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేయ‌డం, దాని అనంత‌ర ప‌రిణామాలు రాష్ట్ర రాజ‌కీయాల్లో కాక పుట్టించిన విష‌యం తెలిసిందే. కోర్టు విచార‌ణ స‌మ‌యంలో గ‌తంలో ప‌లు వాయిదాలు కోరిన అనంత‌రం మంగ‌ళ‌వారం సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌ర‌పు న్యాయ‌వాదులు కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. ర‌ఘురామ‌రాజు రాజ‌కీయ దురుద్దేశంతోనే ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశార‌ని, దానికి విచార‌ణార్హ‌త లేద‌ని వారు అందులో పేర్కొన్నారు. బెయిల్‌ షరతులను జగన్‌ ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్‌ వాదనలో నిజం లేదని వారు కోర్టుకు తెలిపారు. ఇలాంటి కేసుల్లో థర్డ్‌ పార్టీ జోక్యం చేసుకోకూడ‌ద‌ని గ‌తంలో సుప్రీం కోర్టు తీర్పులున్నాయనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయవాదులు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌కు పార్టీ త‌ర‌పున లేఖ కూడా రాశారని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. రఘురామ గ‌తంలో బ్యాంకుల‌కు సొమ్ము ఎగ్గొట్టిన అంశంలో సీబీఐ కేసు న‌మోదు చేసింద‌ని, ఏపీలో ఆయ‌న‌పై అనేక కేసులున్నాయన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పని చేస్తుందని, రఘురామరాజుకు ఈ కేసుతో సంబంధం లేదని వైఎస్ జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు 98 పేజీల కౌంట‌ర్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ కేసు విష‌యంలో మ‌రో ప్ర‌తివాదిగా ఉన్న సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఇందులో మూడే మూడు లైన్ల స‌మాధానం పొందుప‌ర‌చి త‌మ బాధ్య‌త ఇంతేన‌న్నట్టుగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ తేల్చేసింది. ఇంత‌కీ సీబీఐ దాఖ‌లు చేసిన కౌంట‌ర్‌లో ఏముందంటే.. బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ విష‌యంలో ప్ర‌స్తుతం తాము చెప్పేది ఏమీలేదని.. కేసు మెరిట్స్ ప్రకారం కోర్టే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ పేర్కొంది. దీంతో సీబీఐ తీరు న్యాయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ మాత్రం స‌మాధానం ఇచ్చేందుకు సీబీఐ గ‌తంలో కౌంట‌ర్ దాఖ‌లుకు మూడు సార్లు వాయిదాలు ఎందుకు అడిగింద‌న్న సందేహాల‌కూ తావిచ్చిన‌ట్ట‌యింది. లాక్‌డౌన్ నిబంధనల వల్ల భారీగా ఉన్న‌ డాక్యుమెంట్లు తీసుకు రాలేకపోతున్నట్లుగా సీబీఐ తరపు న్యాయవాది గ‌తంలో పదే పదే వాయిదాలు అడిగిన విష‌యం తెలిసిందే. చివరికి సీబీఐ కోర్టు.. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పడంతో సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌క త‌ప్ప‌లేదు. కాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ తీరుపై ఇప్పుడు తీవ్రమైన చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ్ సినిమాపై కర్ణిసేనా సంస్థ ఫైర్.. వెంటనే అవి మార్చాలంటూ..

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>