MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/mahesh-babu-sarkaruvari-patae8b6b7a8-a370-4ecb-a0a6-7cf90fdffd9c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/mahesh-babu-sarkaruvari-patae8b6b7a8-a370-4ecb-a0a6-7cf90fdffd9c-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతుందన్న వార్తల నేపథ్యంలో సినిమా షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు కొత్త సినిమా సర్కారువారి పాట చిత్రీకరణ జులైలో జరుగుతుందని అంటున్నారు. అయితే సినిమా షెడ్యూల్ మొదలు పెట్టగానే.. యూనిట్ అందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారట హీరో మహేష్ బాబు. తన జాగ్రత్త తాను తీసుకోవడంతోపాటు, తన చుట్టూ ఉన్నవారి జాగ్రత్త కూడా ఆలోచించారాయన. mahesh;babu;sarkaruvari;pata{#}mahesh babu;Mahesh;Cinema;Hero;parasuram;keerthi suresh;thaman s;vennela;subba raju;subbaraju;Sarileru Neekevvaru;Blockbuster hit;Mass;NTR Kathanayakudu;Arjun;Teluguసినిమా యూనిట్ కోసం మహేష్ బాబు కేరింగ్ అదుర్స్..సినిమా యూనిట్ కోసం మహేష్ బాబు కేరింగ్ అదుర్స్..mahesh;babu;sarkaruvari;pata{#}mahesh babu;Mahesh;Cinema;Hero;parasuram;keerthi suresh;thaman s;vennela;subba raju;subbaraju;Sarileru Neekevvaru;Blockbuster hit;Mass;NTR Kathanayakudu;Arjun;TeluguTue, 01 Jun 2021 12:00:00 GMTసినిమా షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు కొత్త సినిమా సర్కారువారి పాట చిత్రీకరణ జులైలో జరుగుతుందని అంటున్నారు. అయితే సినిమా షెడ్యూల్ మొదలు పెట్టగానే.. యూనిట్ అందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారట హీరో మహేష్ బాబు. తన జాగ్రత్త తాను తీసుకోవడంతోపాటు, తన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించారాయన.

మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న సర్కారువారి పాట చిత్రీకరణ ఈపాటికే మొదలైంది. అయితే అంతలోనే సెకండ్ వేవ్ ప్రభావంతో దాన్ని వాయిదా వేశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ సంగీతాన్నందిస్తున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అటు పరశురామ్ కూడా గీతగోవిందం వంటి సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ఈ సినిమా హిట్ కోసం కష్టపడుతున్నారు. మహేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్లో కనిపిస్తారని తెలుస్తోంది.

సర్కారువారి పాట సినిమాలో విలన్ గా మరో కథానాయకుడు అర్జున్ నటిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో నటించేందుకు అర్జున్ అంగీకరించారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జులై ఫస్ట్ వీక్ లో తిరిగి చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. హైదరాబాద్‌ లోనే ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో మహేష్‌ - అర్జున్‌ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. వీలైతే ఆలోపు, లేదా షూటింగ్ మొదలైన ఫస్ట్ రోజే.. యూనిట్ లో అందరికీ టీకా పంపిణీ చేయాలని చెప్పారట మహేష్ బాబు. సెకండ్ వేవ్ ప్రభావం మొదలైన తర్వాత తెలుగు సినిమా షూటింగ్ లు ఇంకా మొదలు కాలేదు. మరికొన్నాళ్లు విరామం తీసుకోవాలని దాదాపు అందరు దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ దశలో తొలిసారిగా మహేష్ బాబు ధైర్యం చేసి వచ్చే నెలలో తన సినిమా చిత్రీకరణ తిరిగి మొదలు పెట్టాలనుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొవిడ్ వ‌చ్చి త‌గ్గిందా?.. అయితే మీకు తిరుగులేదు!!

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>