MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/charan9ee8f469-1932-46a0-ab46-d501adb5681a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/charan9ee8f469-1932-46a0-ab46-d501adb5681a-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పవర్ ఫుల్ పాత్రలతో అందరినీ మెప్పించాడు. మగధీర, రంగస్థలం సినిమాల్లో చెర్రీ చేసిన నటన అందరికీ గుర్తుండిపోయింది. ఈ రెండు సినిమాలతో చెర్రీ స్టార్ హోదాను అందుకున్నాడు. మగధీరాతో స్టార్ అనిపించుకున్నా ‘రంగస్థలం’ సినిమాతో అద్భుత నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. అయితే చెర్రీ తన తాజా సినిమాను జక్కన్న దర్శకత్వంలో..charan{#}Cinema;Ram Charan Teja;Rangasthalam;Rajamouli;king;Darsakudu;Director;News;producer;Producer1ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?charan{#}Cinema;Ram Charan Teja;Rangasthalam;Rajamouli;king;Darsakudu;Director;News;producer;Producer1Tue, 01 Jun 2021 08:05:00 GMTరామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పవర్ ఫుల్ పాత్రలతో అందరినీ మెప్పించాడు. మగధీర, రంగస్థలం సినిమాల్లో చెర్రీ చేసిన నటన అందరికీ గుర్తుండిపోయింది. ఈ రెండు సినిమాలతో చెర్రీ స్టార్ హోదాను అందుకున్నాడు. మగధీరాతో స్టార్ అనిపించుకున్నా ‘రంగస్థలం’ సినిమాతో అద్భుత నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. అయితే చెర్రీ తన తాజా సినిమాను జక్కన్న దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామ రాజు పాత్రలో చెర్రీ కనిపించనున్నాడు. ఈ సినిమాలోనూ చెర్రీ ఐకానిక్ పాత్రలో కనిపించనున్నాడు. దాంతో ఈ సినిమాలో చెర్రీ నటవిశ్వరూపం చూడాలని అభిమానులు ఎంతో అభిలషిస్తున్నారు.


అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? సినిమా ఎప్పుడు మొదలవుతుంది..? శంకర్ సినిమాను ఏ కోణంలో తెరకెక్కిస్తున్నాడు..? ఇలా ఎన్నో ప్రశ్నలు వాటికి అభిమానుల ఊహాగానాలు సమాధానాలుగా ఈ సినిమా నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కూడా చరణ్ ఐకానిక్ పాత్రలో కనిపిస్తాడట.


అంతేకాకుండా ఆ పాత్రకోసం చరణ్ మళ్ళీ కసరత్తులు చేయనున్నాడట. అంతేకాకుండా ఇప్పటి వరకు చెర్రీని చూడని లుక్స్‌లో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఇండియాకు తిరిగి వచ్చాక సినిమా షూటింగ్ పనులు కూడా మొదలవుతున్నాయని, అప్పుడే ఈ సినిమా గురించి మొదటి అప్‌డేట్ వస్తుందని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీటిపై అధికారిక ప్రకటన రాలేదు. మరి దిల్‌రాజు ఇండియాకు తిరిగి వచ్చాక ఏమైనా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>