PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr9bb0b3f9-ffd4-44ba-bd59-4bbce30e9e83-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr9bb0b3f9-ffd4-44ba-bd59-4bbce30e9e83-415x250-IndiaHerald.jpgమంత్రి కేటీఆర్.. డైనమిక్ లీడర్.. అలాగే టెక్నాలజీని బాగా వాడతారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన పర్సనల్ అకౌంట్లతో పాటు మంత్రిగా మరికొన్ని ఎకౌంట్లు కూడా ఉంటాయి. కేటీఆర్ టీమ్ వీటి అన్నింటిని పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా కరోనా సమయంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ఫుల్ బిజీగా కనిపిస్తోంది. నిరంతరం ఎవరో ఒకరు ఏదో సాయం కోరుతూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఆయన టీమ్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది. ఇలా కొన్ని రోజులుగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ కు ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఒకటి కాktr{#}Minister;KTR;twitter;Varsham;mondayకేటీఆర్.. మీలాంటి లీడర్.. మా రాష్ట్రానికి కావాలి..!?కేటీఆర్.. మీలాంటి లీడర్.. మా రాష్ట్రానికి కావాలి..!?ktr{#}Minister;KTR;twitter;Varsham;mondayTue, 01 Jun 2021 10:00:00 GMTమంత్రి కేటీఆర్.. డైనమిక్ లీడర్.. అలాగే టెక్నాలజీని బాగా వాడతారు. సోషల్ మీడియాలో చాలా  యాక్టివ్‌గా ఉంటారు. ఆయన పర్సనల్ అకౌంట్లతో పాటు మంత్రిగా మరికొన్ని ఎకౌంట్లు కూడా ఉంటాయి. కేటీఆర్ టీమ్ వీటి అన్నింటిని పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా కరోనా సమయంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ఫుల్ బిజీగా కనిపిస్తోంది. నిరంతరం ఎవరో ఒకరు ఏదో సాయం కోరుతూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఆయన టీమ్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది.

ఇలా కొన్ని రోజులుగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ కు ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. రోజూ వందల్లో విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటిని ఆయన వెంటనే సంబంధిత అధికారులకు పంపుతూ ఫాలో చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నెటిజన్లు కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశంసల్లో కొందరు ఇతర రాష్ట్రాల వారు కూడా ఉంటున్నారు.

బాధితులు ఏ రాష్ర్టానికి చెందినవారైనా స్పందిస్తున్న కేటీఆర్‌ చర్యలకు పలువురు ఫిదా అయిపోతున్నారు. కేటీఆర్.. మీరు సూపర్.. మీలాంటి లీడర్ మా రాష్ట్రానికీ ఉంటే ఎంత బావుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్‌లో నిరంతరం అందుబాటులో ఉంటూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్‌పై ఇలా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోమవారం వెస్ట్‌బెంగాల్‌ రాష్ర్టానికి చెందిన అభినవ్‌ భట్టాచార్య మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన ట్వీట్‌చేశారు.

‘కేటీఆర్‌.. మీరు మానవులేనా లేక సూపర్‌ పవర్స్‌ ఉన్న బోటా? దయచేసి మీ ప్లాస్మాను ఇతర రాజకీయ నాయకులు, మంత్రులకు ఇవ్వండి. ఎందుకంటే మీలాంటి మంత్రులు కావాలి. మీకు, మీ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీసులు ఉండాలి. లవ్‌ ఫ్రమ్‌ వెస్ట్‌బెంగాల్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. అలాగే.. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈఆర్‌ ఆకిబ్‌ సైతం కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. కేటీఆర్‌ సర్‌ మీ లాంటి లీడర్‌ జమ్ముకశ్మీర్‌లోనూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ అండ్‌ రెస్పెక్ట్‌ సర్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.


" style="height: 370px;">



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నీ ఒళ్లో తల వాల్చి సేద తీరాలని ఉంది: పూజా హెగ్డే

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>