MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/5gdf991e3e-0c83-4a96-b9fa-d36ed89d6dbb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/5gdf991e3e-0c83-4a96-b9fa-d36ed89d6dbb-415x250-IndiaHerald.jpgదేశం టెక్నాలజీ పరంగా ఉరుకులు పరుగులు తీస్తోంది. టెక్నాలజీలో ప్రతిరోజు ఒక్కోమెట్టు ఎక్కుతూనే ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోకి మొబైల్ ఫోన్స్ వచ్చేశాయి. ఇప్పుడు సెల్‌ఫోన్లకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. అయితే తమ వినియోగదారులకు అత్యంత ఉన్నతమైన సేవలను అందించాలని అటు ఫోను కంపెనీ వారితో పాటు ఇటు టెలికాం వారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2జీ నుంచి 4జీకి చేరుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా..5g{#}bollywood;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Delhi;June;court5జీపై కోర్టుకొక్కిన బాలీవుడ్ నటి.. ప్రజల్లో చైతన్యం రావాలి..5జీపై కోర్టుకొక్కిన బాలీవుడ్ నటి.. ప్రజల్లో చైతన్యం రావాలి..5g{#}bollywood;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Delhi;June;courtMon, 31 May 2021 15:35:00 GMT దేశం టెక్నాలజీ పరంగా ఉరుకులు పరుగులు తీస్తోంది. టెక్నాలజీలో ప్రతిరోజు ఒక్కోమెట్టు ఎక్కుతూనే ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోకి మొబైల్ ఫోన్స్ వచ్చేశాయి. ఇప్పుడు సెల్‌ఫోన్లకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. అయితే తమ వినియోగదారులకు అత్యంత ఉన్నతమైన సేవలను అందించాలని అటు ఫోను కంపెనీ వారితో పాటు ఇటు టెలికాం వారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2జీ నుంచి 4జీకి చేరుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా అధిగ మించాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో మార్కెట్లోకి 5జీని తీసుకువచ్చారు. ఈ 5జీ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అందరూ వేచి చూస్తున్నారు.


అయితే తాజాగా బాలీవుడ్ నటి జూహీచావ్లా ఈ 5జీ నెట్వర్క్‌పై కోర్టులో పిటిషన్ వేశారు. 5జీ కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతాయని, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ (ఆర్ఎఫ్) వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ప్రజలకు తెలియజేయాలని జూహీ చావ్లా ఎంతో కృషి చేస్తున్నారు. దేశంలో 5జీ అందుబాటులోకి వస్తే ఎన్నో దుష్పరిణామాలు ఎదర్కోవాల్సి వస్తుందని, 5జీ మనుషులు, జంతువులపై ఇప్పటికన్నా 10 నుంచి 100శాతం ఎక్కువ దుష్ప్రభావాన్ని చూపుతుందని ఆమె తెలిపారు. అందుకనే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె చెప్పారు.


జూహీ చావ్లా వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ సి.హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం నిరాకరిస్తూ, ఢిల్లీ హైకోర్టుకు చెందిన మరో బెంచ్‌కు బదిలీ చేసింది. జూన్ 2వ తేదీన ఈ పిటిషన్ విచారణకు రానుంది. అయితే 5జీ టెక్నాలజీ ఇటు మనుషులకు, అటు మూగజీవాలకు కూడా సురక్షితమని  సర్టిఫై చేస్తూ, తమ వాదనను బలపరచే అధ్యయనాలను కూడా జత పరిచేలా ప్రతివాదులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరినట్టు జూహీచావ్లా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంతవరకూ ప్రతివాదులు ఎలాంటి అధ్యయనాలు చేయనట్లయితే, ఎలాంటి ప్రైవేటు ప్రయోజనాలను ఆశించకుండా సమర్ధవంతమైన రీసెర్చ్ చేపట్టాలని కూడా పిటిషన్‌లో కోరినట్టు చెప్పారు. మరి ఈ విషయంలో కోర్టు ఏమని తీర్పునిస్తుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనుష్క వల్లే ఆ సినిమా పోయిందట!

బాలీవుడ్ డైరెక్టర్స్ ని లైన్లో పెడుతున్న బన్నీ ...

ఆయన మల్లెపువ్వులాంటి మనిషి : మెగాస్టార్ పోస్ట్ వైరల్ ..!

ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కి హ్యాపీ బర్త్ డే...!

ప్రైవేట్ ఆసుపత్రుల నిలువుదోపిడి.. చెక్ చెప్పిన హైకోర్ట్..

కృష్ణ.. నిజంగా సూపర్ స్టార్.. !

ఎన్టీఆర్ అడ్డాలో మార్పు కావాల్సిందేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>