MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/tamanna-bhatia-tollywood1d5e456e-0d1e-4daf-8a1e-691adc94b9aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/tamanna-bhatia-tollywood1d5e456e-0d1e-4daf-8a1e-691adc94b9aa-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలోకి పరభాషా హీరోయిన్లు ఎంతమంది వస్తే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు అంత ఉపయోగం. హీరోయిన్లెవరూ దాదాపుగా డబ్బింగ్ చెప్పుకోలేరు కాబట్టి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు పండగే. అయితే మెల్ల మెల్లగా టాలీవుడ్ లో పాతుకుపోయే హీరోయిన్లంతా తమ డబ్బింగ్ తాము చెప్పుకునే స్టేజ్ కి వచ్చేస్తారు. అంతటితో ఆయా హీరోయిన్లతో డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు పనిలేకుండా పోతుంది. మరో కొత్తహీరోయిన్ ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూడాలి. రీసెంట్ గా తమన్నా కూడా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానంటూ తేల్చి చెప్పింది. tamanna-bhatia-tollywood{#}Telugu;Tollywood;tamannaah bhatia;Nithin Reddy;bollywood;Tabuడబ్బింగ్ ఆర్టిస్ట్ ల పొట్టకొడుతున్న తమన్నా..డబ్బింగ్ ఆర్టిస్ట్ ల పొట్టకొడుతున్న తమన్నా..tamanna-bhatia-tollywood{#}Telugu;Tollywood;tamannaah bhatia;Nithin Reddy;bollywood;TabuMon, 31 May 2021 12:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలోకి పరభాషా హీరోయిన్లు ఎంతమంది వస్తే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు అంత ఉపయోగం. హీరోయిన్లెవరూ దాదాపుగా డబ్బింగ్ చెప్పుకోలేరు కాబట్టి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు పండగే. అయితే మెల్ల మెల్లగా టాలీవుడ్ లో పాతుకుపోయే హీరోయిన్లంతా తమ డబ్బింగ్ తాము చెప్పుకునే స్టేజ్ కి వచ్చేస్తారు. అంతటితో ఆయా హీరోయిన్లతో డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు పనిలేకుండా పోతుంది. మరో కొత్తహీరోయిన్ ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూడాలి. రీసెంట్ గా తమన్నా కూడా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానంటూ తేల్చి చెప్పింది.

వాస్తవానికి తమన్నాది కాస్త బొంగురు గొంతు. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నా కూడా గొంతు బాగుండదనే ఉద్దేశంతోటే ఆమె సినిమాల్లో సొంత వాయిస్ వినిపించదు. ఒకటీ అరా ప్రయోగాలు చేసినా కూడా ఫలించలేదు. దీంతో డబ్బింగ్ చెప్పుకోకుండానే ఇన్నాళ్లూ బండిలాగించింది తమన్నా. తాజాగా ఆమె వాయిస్ ని ఇంప్రూవ్ చేసుకోడానికి బాగా కష్టపడింది. డబ్బింగ్ స్టూడియోల్లో కూడా ప్రాక్టీస్ చేసింది. చివరకు తన వాయిస్ పై తనకు బాగా నమ్మకం కుదరడంతో.. సినిమాల్లో కూడా డబ్బింగ్ చెప్పుకుంటానని దర్శక నిర్మాతల్ని ఒప్పించింది. అన్నీ కుదిరితే సీటీమార్, ఎఫ్-3 సినిమాల్లో తన సొంత గొంతుని పరిచయం చేస్తుంది తమన్నా.

ఈ విషయాన్ని తమన్నా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. తానే స్వయంగా డబ్బింగ్ చెప్పడం వల్ల తన పాత్రలకు పరిపూర్ణత ఎలా వస్తుందో గ్రహించానని అంటోంది. తన గొంతుతో డబ్బింగ్ చెప్పడం వల్ల చాలా మార్పు కన్పిస్తుందని చెప్పుకొచ్చింది. సీటీమార్, ఎఫ్ 3 తో పాటు, నితిన్ ‘మాస్ట్రో’లో కూడా తమన్నా నటిస్తోంది. ఈ రీమేక్‌లో బాలీవుడ్ నటి టబు పాత్రలో కనిపిస్తుంది తమన్నా. ఇటీవల లెవంత్ అవర్ అంటూ ఓ వెబ్ సిరీస్ తో వచ్చినా.. అది పెద్దగా సందడి చేయలేదు. దీంతో “నవంబర్ స్టోరీ” అనే మరో వెబ్ సిరీస్ చేసింది. ఈసారి మాత్రం తమన్నా నటనకు ప్రశంసలు దక్కాయి. “నవంబర్ స్టోరీ”కి హిట్ టాక్ రావడంతో.. తమన్నా వెబ్ సిరీస్ లపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతోందట. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ.. తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానంటోంది మిల్కీ బ్యూటీ.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

భవిష్యత్తులో పుట్టిన బిడ్డ నుండే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారా ?

ఆనందయ్య మందుకి చిక్కులు.. అనుమతులు లేనట్లే?

సూపర్ స్టార్ కృష్ణ బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?

చంద్రబాబు దెబ్బకి విలవిల్లాడుతున్న ఏపీ బీజేపీ..

ఎన్నారైకి రూ.376 కోట్ల జరిమానా.. 20 ఏళ్ల జైలు శిక్ష.. కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>