Andhra Pradesh
oi-Syed Ahmed
నెల్లూరులో కరోనా మందు అందిస్తున్న ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్యకు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నుంచి ఆయుర్వేద మందు తీసుకున్న రోగి, రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య ఇవాళ కరోనాతో పోరాడుతూ చనిపోయారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఉంచి ఆయనకు కొద్దిరోజులుగా చికిత్స అందిస్తున్నా ఆయన కోలుకోలేదు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన ఇవాళ చనిపోయారు.
వాస్తవానికి ఆనందయ్య మందు తీసుకున్న కొన్ని రోజులకే కోటయ్య పరిస్ధితి విషమించడంతో నెల్లూరు జీజీహెచ్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మధ్యలో ఆయన కోలుకున్నట్లు కనిపించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. కరోనాకు ప్రస్తుతం అందిస్తున్న అల్లోపతి చికిత్స కొనసాగించినా ఆయన కోలుకోలేదు. చివరకు ఇవాళ పరిస్ధితి మరింత విషమించి ప్రాణాలు కోల్పోయారు. అసలే ఇవాళ ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతులపై ఓ ప్రకటన వస్తుందని ఆశిస్తున్న వారికి ఈ ఘటన భారీ షాకిచ్చింది.

ఆనందయ్య మందు తీసుకున్న కొంతకాలానికే తొలుత కోటయ్యకు కళ్ల సమస్యలు ఎదురయ్యాయి. దానికి వైద్యం అందిస్తూవే కరోనా చికిత్స కూడా చేస్తున్నారు. అలాంటి సమయంలో ఇవాళ మరోసారి ఆయన పరిస్ధితి తీవ్రమైంది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. గతంలో ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత తాను కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో కోటయ్యపై అందరి దృష్టీపడింది. అదే సమయంలో నెల్లూరు ఆనందయ్య మందుకు ఆయుష్‌తో పాటు ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆయా సంస్ధలు పునరాలోచనలో పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
English summary
in a big setback to nellore ayurvedic covid doctor anandayya, his patient and retired head master kotaiah has been died today.
Story first published: Monday, May 31, 2021, 11:07 [IST]