CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/deathbf92f61b-ac58-4823-a8ae-61acca3f1896-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/deathbf92f61b-ac58-4823-a8ae-61acca3f1896-415x250-IndiaHerald.jpgఒక్కప్పుడు పెళ్లి అనగానే అమ్మాయి, అబ్బాయిని వివాహం జరిగే వరకు కలుసుకునేవారు కాదు. కానీ ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వెడ్డింగ్ షూట్స్ లో అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా హుకుంపేట మండలం తీగలవలసలో ఈ విషాదం ఘటన చోటు చేసుకుంది. death{#}marriage;Vishakapatnam;mandalam;sunday;News;policeఊహించని విషాదం: ప్రాణం తీసిన పెళ్లి ఫోటో షూట్..?ఊహించని విషాదం: ప్రాణం తీసిన పెళ్లి ఫోటో షూట్..?death{#}marriage;Vishakapatnam;mandalam;sunday;News;policeMon, 31 May 2021 10:00:00 GMTఒక్కప్పుడు పెళ్లి అనగానే అమ్మాయి, అబ్బాయిని వివాహం జరిగే వరకు కలుసుకునేవారు కాదు. కానీ ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వెడ్డింగ్ షూట్స్ లో అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా హుకుంపేట మండలం తీగలవలసలో ఈ విషాదం ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సన్యాసమ్మపాలెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల మోరి నిరంజన్‌, 25 ఏళ్ల బాకూరు వినోద్‌కుమార్‌, 22 ఏళ్ల తమర్భ శివనాగేంద్రకుమార్‌లు మరో ఏడుగురు యువకులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం తీగలవలస గ్రామ సమీపంలోని గుడ్డిగుమ్మి జలపాతానికి వెళ్లారు. అయితే అందులో ముగ్గురు తమ స్నేహితుడికి త్వరలో వివాహం ఉండడంతో పెళ్లి ఫోటో షూట్ నిర్వహిద్దామని జలపాతానికి దగ్గరగా వెళ్లారు.

అయితే ఈ ముగ్గురు ఫోటోలతో బిజీగా ఉండగా.. మిగిలిన వారు వేరే చోట స్నానాలు చేస్తున్నారు. అలా సరదాగా ఫొటోలు తీసుకుంటున్న సమయంలో నిరంజన్‌, వినోద్‌ కుమార్‌ కాలుజారి ఊబిలాంటి ప్రాంతంలో చిక్కుకున్నారు. అయితే ఆ ఇద్దరికీ ఈత రాదు. ఒడ్డునే ఉన్న వినోద్‌ కుమార్‌కు ఈత రావడంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతడూ నీటిలో మునిగిపోయాడు. వీరితోపాటు వచ్చిన మిగిలిన వారు ఈ విషయం గమనించే లోపే ముగ్గురూ గల్లంతయ్యారు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో ఎవరూ సహాయం చేసేవారు లేకుండాపోయారు.

ఇక సమాచారం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి యువకుల ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. వారు మునిగిపోయిన ప్రాంతం పెద్ద ఊబిలా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. హుకుంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆదివారం రాత్రి వరకు మునిగిపోయిన వారిని బయటకు తీయడం కుదరలేదు. ఉదయాన్నే ఆ మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం మొదలెట్టారు. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నీట మునిగి ప్రాణాలు పోయాయని సంగతి తెలియడంతో సన్యాసమ్మపాలెంలో విషాదఛాయలు అలకుమున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆహా ను ఒక కుదుపు కుదపబోతున్న దిల్ రాజ్ !

చంద్రబాబు దెబ్బకి విలవిల్లాడుతున్న ఏపీ బీజేపీ..

ఎన్నారైకి రూ.376 కోట్ల జరిమానా.. 20 ఏళ్ల జైలు శిక్ష.. కారణం అదేనట..?

ఏపీ డీజీపీ ఫేక్ అకౌంట్.. షాక్ ఇచ్చిన హ్యాకర్లు

ఆసుపత్రిలో చేరిన కౌశల్ భార్య..?

స్మరణ : నటనకు ప్రతిరూపం ధర్మవరపు సుబ్రహ్మణ్యం..

ప్రభాస్ సినిమా ప్లాప్ కావడానికి ప్రభుదేవాకి సంబంధం ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>