MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-krishna1d48bdd5-ac36-47a8-aa4d-927f3d79ba69-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/superstar-krishna1d48bdd5-ac36-47a8-aa4d-927f3d79ba69-415x250-IndiaHerald.jpgకృష్ణ కౌబాయ్ గా నటించిన మూవీస్ ఇవే..? టాలీవుడ్ ఇండస్ట్రీకి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కుతుంది. నిజానికి తెలుగులో కౌబాయ్ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ని తప్ప మరెవరినీ ఊహించుకోలేము. ఆయన ఆ పాత్రలలో జీవించేసి ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసారు. అయితే ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కాగా ఆయన తన సినీ కెరీర్ లో మొత్తం ఎన్ని కౌబాయ్ చిత్రాల్లో నటించారో తెలుసుకుందాం. 1. మోసగాళ్లకు మోసగాడు. 1971 ఆగస్టు 27న విడుదలైన మోసగాళ్లకు మోసగాడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయsuperstar-krishna{#}krishna;Rajani kanth;Chitram;Cinema;Hollywood;vijaya nirmala;Tollywood;Rajasthan;rani;raja;vijay;Joseph Vijay;Nijam;Heroine;Successకృష్ణ కౌబాయ్ గా నటించిన మూవీస్ ఇవే..?కృష్ణ కౌబాయ్ గా నటించిన మూవీస్ ఇవే..?superstar-krishna{#}krishna;Rajani kanth;Chitram;Cinema;Hollywood;vijaya nirmala;Tollywood;Rajasthan;rani;raja;vijay;Joseph Vijay;Nijam;Heroine;SuccessMon, 31 May 2021 12:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీకి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కుతుంది. నిజానికి తెలుగులో కౌబాయ్ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ని తప్ప మరెవరినీ ఊహించుకోలేము. ఆయన ఆ పాత్రలలో జీవించేసి ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసారు. అయితే ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కాగా ఆయన తన సినీ కెరీర్ లో మొత్తం ఎన్ని కౌబాయ్ చిత్రాల్లో నటించారో తెలుసుకుందాం.



1. మోసగాళ్లకు మోసగాడు.



1971 ఆగస్టు 27న విడుదలైన మోసగాళ్లకు మోసగాడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం మూడు హాలీవుడ్ చిత్రాల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా లో కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లుగా నటించారు.



2. మంచివాళ్ళకు మంచివాడు.



1973లో వచ్చిన మంచివాళ్లకు మంచివాడు సినిమాకి కూడా కె.ఎస్.ఆర్ దాసే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కూడా కృష్ణ కౌబాయ్ గా అద్భుతమైన నటనా చాతుర్యాన్ని కనబర్చి టాలీవుడ్ ఫ్యాన్స్ ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను రాజస్థాన్ గ్రామాల్లో చిత్రీకరించారు. ఈస్ట్ మన్ కలర్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులకు కనులవిందుగా మారింది.



3. మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త..



కె.వి.యస్ కుటుంబ రావు దర్శకత్వంలో 1972వ సంవత్సరంలో తెరకెక్కిన మొనగాడొస్తున్నాడు జాగ్రత్త చిత్రంలో కూడా కృష్ణ కౌబాయ్ తరహా పాత్ర పోషించారు. ఈ సినిమాలో కృష్ణ సరసన జ్యోతిలక్ష్మి నటించారు.



4. చలాకీ రాణి కిలాడీ రాజా.



అంజలీదేవి, విజయలలిత, కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చలాకీ రాణి కిలాడీ రాజా చిత్రం 1971 సంవత్సరంలో విడుదలైంది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ కౌబాయ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.



5. నిజం నిరూపిస్తా



జానకిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన నిజం నిరూపిస్తా చిత్రంలో కృష్ణ విజయలలిత హీరో, హీరోయిన్స్ గా నటించారు. 1972వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కూడా సక్సెస్ అయింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల ను పూర్తిగా నమ్మెస్తారా...?

భవిష్యత్తులో పుట్టిన బిడ్డ నుండే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారా ?

ఆనందయ్య మందుకి చిక్కులు.. అనుమతులు లేనట్లే?

సూపర్ స్టార్ కృష్ణ బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?

చంద్రబాబు దెబ్బకి విలవిల్లాడుతున్న ఏపీ బీజేపీ..

ఎన్నారైకి రూ.376 కోట్ల జరిమానా.. 20 ఏళ్ల జైలు శిక్ష.. కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>