MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mladc194ce5-1045-4a34-9174-502ebd212021-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mladc194ce5-1045-4a34-9174-502ebd212021-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల్లో సైలెంట్‌గా పనిచేసుకుంటూ, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల్లో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఒకరు. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో బరిలో దిగిన దూలం...దాదాపు 9 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ నేత జయమంగళ వెంకటరమణపై విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాగేశ్వరరావు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. వారికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు.ysrcp mla{#}2019;MLA;YCP;Krishna River;Kaikaluru;Thummala Nageswara Rao;Akkineni Nageswara Rao;nageshwara rao akkineni;TDP;Aqua;Government;local languageహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే వర్క్ బాగుందా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే వర్క్ బాగుందా?ysrcp mla{#}2019;MLA;YCP;Krishna River;Kaikaluru;Thummala Nageswara Rao;Akkineni Nageswara Rao;nageshwara rao akkineni;TDP;Aqua;Government;local languageMon, 31 May 2021 05:00:00 GMTకృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల్లో సైలెంట్‌గా పనిచేసుకుంటూ, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల్లో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఒకరు. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో బరిలో దిగిన దూలం...దాదాపు 9 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ నేత జయమంగళ వెంకటరమణపై విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాగేశ్వరరావు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. వారికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు.


అటు కైకలూరు నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల భవనాల నిర్మాణాలు జరిగాయి. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఆక్వా రైతులకు అండగా ఉంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలని తగ్గించింది.


అలాగే చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి ప్రాధికార సంస్థ (డెవలప్‌మెంట్‌ అథారిటీ)ని ఏర్పాటు చేసింది. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ అందించడంతో పాటు విక్రయాల్లో రైతులు నష్టపోకుండా చూడటం అథారిటీ ప్రధాన లక్ష్యం. అటు కైకలూరులో కూడా విస్తరించిన కొల్లేరు ప్రాంత చేపల రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. కరోనా సమయంలో చేపల, రొయ్యల రైతులు భారీగా నష్టపోతున్నారు. వారిని ఆదుకోవాల్సిన అవసరముంది. అయితే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయి.  డ్రైనేజి వ్యవస్థని మెరుగుపర్చాలసిన అవసరముంది.


ఇక రాజకీయ పరంగా చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే దూలం స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. ఇక టీడీపీ తరుపున జయమంగళ వెంకటరమణ పనిచేస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన ఈయన, 2014లో బీజేపీకి పొత్తులో సీటు పోవడంతో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే వెంకటరమణ నిదానంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. దీని వల్ల నియోజకవర్గంలో టీడీపీ పూర్తి బలపడలేదు. మొత్తానికైతే పథకాలు, ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గంలో మంచి మార్కులే పడుతున్నాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెండేళ్లలో టీడీపీకి కలిసొచ్చింది ఏంటి?

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>