PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-vista78d7edf9-5f62-4f35-b101-7daaaba5f2fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-vista78d7edf9-5f62-4f35-b101-7daaaba5f2fa-415x250-IndiaHerald.jpgసెంట్రల్ విస్టా ప్రాజెక్టు కేంద్ర స్థాయిలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయిన వలస కూలీలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ క్రమంలో సెంట్రల్ విస్టాను యుద్దప్రాతిపదికన తీసుకుని వెంటనే ప్రారంభించారు. దాంతో ఈ ప్రాజెక్టు విషయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని నివాసం అత్యవసరం ఎలా అవుతుందని, ఇప్పుడు సెంట్రల్ విస్టా అంత అవసరం..central vista{#}High court;central government;Capital;Prime Minister;Party;workers;Delhi;court;Supreme Courtసెంట్రల్ విస్టా వేస్ట్ కాదు.. ప్రతిపక్షానికి హైకోర్టు ఝలక్..సెంట్రల్ విస్టా వేస్ట్ కాదు.. ప్రతిపక్షానికి హైకోర్టు ఝలక్..central vista{#}High court;central government;Capital;Prime Minister;Party;workers;Delhi;court;Supreme CourtMon, 31 May 2021 15:03:09 GMTన్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కేంద్ర స్థాయిలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయిన వలస కూలీలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ క్రమంలో సెంట్రల్ విస్టాను యుద్దప్రాతిపదికన తీసుకుని వెంటనే ప్రారంభించారు. దాంతో ఈ ప్రాజెక్టు విషయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని నివాసం అత్యవసరం ఎలా అవుతుందని, ఇప్పుడు సెంట్రల్ విస్టా అంత అవసరం లేదని, ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును దేశంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతను నివారించేందుకు వాడితే బాగుంటుందని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.


అయితే ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న ఉద్రిక్త పరిస్తితుల్లో సెంట్రల్ విస్టా నిర్మాణం అవసరం లేదని, దీని కారణంగా చాలా మంది కార్మికులు ఒకే ప్రదేశంలో చేరుతారని, అందువల్ల కరోనా వ్యాప్తి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని అందుచేత ఈ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌, చరిత్రకారుడు సోహైల్‌ హష్మీ, ట్రాన్సలేటర్‌ అన్యా మల్హోత్రా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపింది.



 ఈ విచారణలో భాగంగా సెంట్రల్ విస్టా అత్యవసరమైనదేనని హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కొనసాగాల్సిందే అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీని కారణంగా ఎందరికో ఉపాధి లభిస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ విస్టా ద్వారా వలస కూలీలకు ఉపాధి కలుగుతుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ ప్రాజెక్టు చట్టబద్దమేనని సుప్రీం కోర్టు సమర్థించిందని,  అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతి ఇచ్చినట్లు ఢిల్లీ హైకోర్టు గుర్తుచేసింది. ఈ ప్రాజెక్టును నిలిపివేయడానికి సరైన కారణం ఒక్కటి కూడా లేదని తెలిపింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుపై వేసిన పిటిషన్ నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ఎవరో బలవంతంగా వేయించిందిలా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్‌దారులకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ గ్రామానికి వ్యాక్సిన్ అందించడం నా బాధ్యతన్న మహేష్

సీక్రెట్ ప్లేస్‌లో టాటూతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..?

సూపర్ స్టార్ కృష్ట టాలీవుడ్ కి కొత్త వన్నె తీసుకు వచ్చారు.. ఆయన జీవితంలో మరపురాని ఘట్టాలెన్నో...

డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా.. కోరిక నెరవేరినట్లే..

"సర్కారు వారి పాట" లో విలన్ గా అతను ఖరారేనా ?

నాగార్జున సలహా..ఫాలో అవుతున్న సమంత

ఆ కమ్మ టీడీపీ ఎమ్మెల్యేలకు మైనస్ అవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>