MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-pakkana-aa-heroine-ante-matala-bhayya-inthaki-evara-heroine-antea0186e76-12c7-4cdd-a890-2edebca949af-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-pakkana-aa-heroine-ante-matala-bhayya-inthaki-evara-heroine-antea0186e76-12c7-4cdd-a890-2edebca949af-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ, నేడు 79వ జన్మదినం జరుపుకున్న విషయం తెలిసిందే. తన సినిమా కెరీర్ లో దాదాపుగా 350 కి పైగా సినిమాలు చేసిన కృష్ణ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పలు విభాగాల్లో తనదైన ఆకట్టుకునే టాలెంట్ తో ఎందరో ప్రేక్షకాభిమానుల మనసు గెలుచుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో సరికొత్త నూతన సాంకేతికతని పరిచయం చేసారు కృష్ణ. ఇక హీరోగా తొలిసారిగా తేనెమనసులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృష్ణ, ఆ మూవీ తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా అనుభsuperstar-krishna{#}krishna;Tollywood;Rajani kanth;Cinema;Telugu;Goodachari 116;Mass;Blockbuster hit;Newsప్చ్ .... ఆ విషయంలో మాత్రం కృష్ణ కు జరిగింది తీరని అన్యాయమే .... ??ప్చ్ .... ఆ విషయంలో మాత్రం కృష్ణ కు జరిగింది తీరని అన్యాయమే .... ??superstar-krishna{#}krishna;Tollywood;Rajani kanth;Cinema;Telugu;Goodachari 116;Mass;Blockbuster hit;NewsMon, 31 May 2021 22:43:12 GMTటాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ, నేడు 79వ జన్మదినం జరుపుకున్న విషయం తెలిసిందే. తన సినిమా కెరీర్ లో దాదాపుగా 350 కి పైగా సినిమాలు చేసిన కృష్ణ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పలు విభాగాల్లో తనదైన ఆకట్టుకునే టాలెంట్ తో ఎందరో ప్రేక్షకాభిమానుల మనసు గెలుచుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో సరికొత్త నూతన సాంకేతికతని పరిచయం చేసారు కృష్ణ. ఇక హీరోగా తొలిసారిగా తేనెమనసులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృష్ణ, ఆ మూవీ తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా అనుభవజ్ఞుడిలా తేనెమనసులులో కృష్ణ కనబరిచిన నటనకు అందరి నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఆ తరువాత కృష్ణ సాక్షి, గూఢచారి 116 వంటి సినిమాల్లో నటించి తద్వారా మరొక రెండు విజయాలు అందుకోవడం అనంతరం ఆయనకు మరింతగా ఛాన్స్ లు దక్కడం జరిగింది. ఆపై వచ్చిన ఛాన్స్ లు సద్వినియోగం చేసుకున్న కృష్ణ అనతికాలంలోనే అప్పటి సీనియర్ నటులకు సైతం గట్టి పోటీని ఇచ్చారు. ఇక కృష్ణ నుండి సినిమా వస్తుంది అంటే ముఖ్యంగా అప్పటి యువత, మాస్ ఆడియన్స్ థియేటర్స్ వద్ద చేసే హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు, గొప్ప గొప్ప పాత్రలు చేసిన కృష్ణకు ప్రేక్షకుల నుండి రివార్డులు, భారీ కలెక్షన్ల రికార్డులు అయితే దక్కాయిగాని అవార్డులు మాత్రం పెద్దగా లభించలేదు.

కృష్ణ నటించిన అనేక సినిమాలకు గాను ఆయనకు ఉత్తమ నటుడిగా అవార్డులు దక్కవలసిందని, అయితే అప్పట్లో ఏమి జరిగిందో ఏమో గాని ఆయన చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలకు సైతం అవార్డులు దక్కకపోవడం తామందరికీ ఎప్పటికీ నిరాశగా మిగిలిపోయే విషయం అని ఇప్పటికీ పలువురు కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. నిజానికి కృష్ణ కు అవార్డులు ఎందుకు దక్కలేదు అనేదానికి సరైన సమాధానం లేనప్పటికీ అప్పటి అవార్డుల కమిటీలోని కొందరు కృష్ణ ముక్కుసూటితనం, మంచి తనాన్ని మెచ్చేవారు కాదనే వార్తలు అప్పట్లో ప్రచారం అయ్యాయి ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జీవీ వర్సెస్ బొల్లా: వినుకొండలో రచ్చ...రాజకీయం ఎవరిది?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??

భారతీయ సినిమాకి ఆల్ టైం సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పిక్స్ వైరల్..

రాత్రే ఆ పాలు ఎందుకు తాగాలో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>