PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ufo85196e72-3f77-491b-94b4-b763b4d66833-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ufo85196e72-3f77-491b-94b4-b763b4d66833-415x250-IndiaHerald.jpgఫ్లయింగ్ సాసర్స్.. గ్రహాంతర వాసుల వాహనాలుగా చెప్పుకుంటున్న ఎగిరే వస్తువులు. వీటినే యూఎఫ్‌ఓలు అంటారు. అంటే అన్ ఐడెంటిఫైడ్‌ ఆబ్జెక్ట్స్ అన్నమాట. గ్రహాంతరవాసులు ఉన్నారా అనే అంశం ఎప్పటి నుంచో కుతూహలం రేపుతున్న అంశం. ఈ అంశంపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. యూట్యూబ్‌లో వెదికితే అనేక వీడియోలు కనిపిస్తుంటాయి. అయితే అందులో నిజమెంతో తెలియదు. కానీ.. తాజా ఓ అమెరికా యుద్ధ నౌకను కొన్ని ఫ్లయింగ్ సాసర్లు చుట్టుముట్టాయన్న విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇంత కలకలం ఎందుకంటే.. దీనికి ఓ వీడియో సాక్ష్యం బయటపడింది. అంతే కాదufo{#}American Samoaఅమెరికాపై దాడికి ఫ్లయింగ్ సాసర్స్ ప్రయత్నం.. ఇదిగో వీడియో ప్రూఫ్‌అమెరికాపై దాడికి ఫ్లయింగ్ సాసర్స్ ప్రయత్నం.. ఇదిగో వీడియో ప్రూఫ్‌ufo{#}American SamoaSun, 30 May 2021 10:00:00 GMTఅమెరికా యుద్ధ నౌకను కొన్ని ఫ్లయింగ్ సాసర్లు చుట్టుముట్టాయన్న విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఇంత కలకలం ఎందుకంటే.. దీనికి ఓ వీడియో సాక్ష్యం బయటపడింది. అంతే కాదు.. దాన్ని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ కూడా ధ్రువీకరించింది. ఈ వీడియోలో ఏముందంటే.. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టాయి. ఇందుకు సంబంధించిన రాడార్‌ తెర దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. ఇన్వెస్టిగేటివ్ షార్ట్ ఫిల్మ్‌ డైరెక్టర్ జెరీమీ కార్బెల్‌ ఈ వీడియోను తాజాగా విడుదల చేశారు.

అయితే ఈ వీడియో ఇప్పటిది కాదండోయ్... ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాన్‌ డియెగో తీరానికి చేరువలో 2019 జులైలో జరిగిందట. యూఎస్‌ఎస్‌ ఒమాహా అనే యుద్ధనౌకను 9 యూఎఫ్‌వోలు చుట్టుముట్టాయని డైరెక్టర్ కార్బెల్‌ చెప్పారు. ఆయన విడుదల చేసిన రాడార్‌ చిత్రాల్లోనూ అవి కనిపించాయి. ఈ ఫ్లయింగ్ సాసర్లు... గంటకు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయట. షాకింగ్ విషయం ఏంటంటే... ఒమాహా యుద్ధనౌక వేగంతో పోలిస్తే ఇది దాదాపు 3రెట్లు ఎక్కువ.

ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. కొద్దిసేపు రాడార్‌ తెరపై కనిపించిన తర్వాత అవి అదృశ్యమయ్యాయి. అంటే.. రాడార్‌ పరిధికి కూడా అందకుండా  అవి వెళ్లిపోయాయన్నమాట. బహుశా అవి.. ఆకాశంలో చాలా ఎత్తుకు గానీ సముద్రంలోకి గానీ అవి చేరి ఉండొచ్చని భావిస్తున్నారు.  ఇంతకీ ఈ వీడియో ఎలా తీశారంటే.. నౌకలోని కమాండ్‌ కేంద్రం నుంచి ఈ వీడియోను చిత్రీకరించారట. ఇన్వెస్టిగేటివ్ షార్ట్ ఫిల్మ్‌ డైరెక్టర్ జెరీమీ కార్బెల్‌ మొన్న 15న కూడా యూఎఫ్‌వోలకు సంబంధించిన ఒక వీడియో విడుదల చేశారు. అందులోనూ ఒక గోళాకార యూఎఫ్‌వో కనిపించింది.

" style="height: 370px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెల్ఫీ అడిగారని అభిమానిని నడిరోడ్డుపై దారుణం..!!

జగన్ @ 730 : అన్న సినిమా కు చేసిందేంలేదు మరి !

యాంకర్స్ నుంచి హీరోయిన్స్ గా మారింది వీళ్ళే..?

ఆదివారం ఓటీటీ లలో ఈ సినిమా లు చూసి ఎంజాయ్ చేయండి!!

జగన్ @ 730 : 30 ఏళ్లు పాలించేలానే ఉందా ?

జగన్ @ 730 : రెండేళ్ల పాలన .. మరొక చరిత్ర

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>