MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun3107619a-07a5-42df-a434-3ad30ce75758-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun3107619a-07a5-42df-a434-3ad30ce75758-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ వరుస సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు.Allu Arjun{#}Arjun;Telugu;Allu Arjun;Gangothri;Hero;sukumar;India;Director;Darsakudu;Cinema;Chiranjeevi;Party;Chitramఅల్లు అర్జున్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?అల్లు అర్జున్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?Allu Arjun{#}Arjun;Telugu;Allu Arjun;Gangothri;Hero;sukumar;India;Director;Darsakudu;Cinema;Chiranjeevi;Party;ChitramSun, 30 May 2021 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ వరుస సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సుకుమార్ రెండు స్టోరీలుగా.. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు బన్నీ రెమ్యూనరేషన్ కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ అల్లు అర్జున్ మొదటి పారితోషకం ఎంత తీసుకున్నాడో తెలుసా ? బన్నీ మొదటిసారిగా తీసుకున్న పారితోషకం  కేవలం వంద రూపాయాలు మాత్రమే. అది కూడా దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చారు. ఎంటీ నమ్మడం లేదు కదా.. కానీ ఇది అక్షరాల నిజం. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ ఓ ఇంటర్వూలో చెప్పారు.

ఇక అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కంటే ముందే అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి సినిమా డాడీలో నటించాడు. అయితే ఆ చిత్రానికి ఎంత పారితోషికం తీసుకున్నారన్న సంగతి తెలియదు. ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఓ పార్టీ జరిగింది. అయితే అక్కడ బన్నీ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఆ పార్టీకి రాఘవేంద్రరావు కూడా వచ్చారు. పార్టీలో బన్నీ డ్యాన్స్ చూసిన రాఘవేంద్రరావు.. ముచ్చటపడి అల్లు అర్జున్ కు రూ.100 ఇచ్చారట. ఇక ఆ తర్వాత బన్నీ హీరోగా గంగోత్రి సినిమా రావడం.. అదే చిత్రం రాఘవేంద్రరావుకు 100వ సినిమా కావడం విశేషం. ఇక రాఘవేంద్రరావు ఇచ్చిన రూ.100 ఇప్పటికీ బన్నీ వాళ్ల అమ్మ దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ @ 730 : రెండేళ్ల పాలన .. మరొక చరిత్ర

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?

రెండేళ్ల జగన్ పాలన.. అందరివాడా.. ? కొందరివాడా. ?

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..

టాలీవుడ్ కి బాహుబలి ఫోబియా .... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>