PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdde85cbd-7a51-4279-866a-15e44727f506-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdde85cbd-7a51-4279-866a-15e44727f506-415x250-IndiaHerald.jpgతెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు సొమ్మును జూన్‌ 10 నుంచి 25లోగా రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ పదో తేదీని గడువుగా పెట్టుకుని అప్పటివరకూ రెవెన్యూ భూ ఖాతాల్లో పార్ట్‌ బీ నుంచి పార్ట్‌ ఏ లోకి పేర్లు మారిన రైతులందరికీ ఈ సొమ్ము వేయాలని కేసీఆర్ ఆదేశించారు. గత యాసంగిలో రైతుబంధు నిధుల జమకు అనుసరించిన విధానాన్నే ఈ వానాకాలం సీజన్‌లోనూ పాటించాలని కేసీఆర్ సూచించారు. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. సాగుకు సంబంధించిkcr{#}June;Telangana;CM;Good news;Good Newwz;RBI;KCR;police;Government;Chief Ministerతెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి రైతు బంధు సొమ్ముతెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి రైతు బంధు సొమ్ముkcr{#}June;Telangana;CM;Good news;Good Newwz;RBI;KCR;police;Government;Chief MinisterSun, 30 May 2021 08:05:18 GMTతెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు సొమ్మును జూన్‌ 10 నుంచి 25లోగా రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ పదో తేదీని గడువుగా పెట్టుకుని అప్పటివరకూ  రెవెన్యూ భూ ఖాతాల్లో పార్ట్‌ బీ నుంచి పార్ట్‌ ఏ లోకి పేర్లు మారిన రైతులందరికీ ఈ సొమ్ము వేయాలని కేసీఆర్ ఆదేశించారు.  గత యాసంగిలో రైతుబంధు నిధుల జమకు అనుసరించిన  విధానాన్నే ఈ వానాకాలం సీజన్‌లోనూ  పాటించాలని కేసీఆర్ సూచించారు.

వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. సాగుకు సంబంధించిన అన్ని సమస్యలపై చర్చించారు. రైతు బంధు సొమ్ము గడువులోగా రైతుల ఖాతాల్లో పడాలని సూచించిన కేసీఆర్.. కల్తీ విత్తనాల తయారీ, విక్రయాల అంశంపైనా గట్టిగా స్పందించారు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఎంతటి వారినైనా పీడీ చట్టం కింద అరెస్టు చేయాలని సూచించారు.

ఈ విషయం గురించి సీఎం కేసీఆర్ నేరుగా డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ‘‘ఇక మీరు నరసింహావతారం ఎత్తాలె. దొరికినోళ్లను దొరికినట్టే పట్టుకుని పీడీ చట్టం కింద కేసులు పెట్టాలె. తెలంగాణలో కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేలా మీ చర్యలుండాలె. వారు తప్పించుకోకుండా డేగకన్నుతో చక్రవ్యూహం పన్నాలె. నకిలీ విత్తనాలే కాదు.. ఎరువులు, జీవన పురుగుమందుల పేరుతో రైతులను మోసం చేసే ముఠాలనూ వదలకండి అని డీజీపీకి సీఎం కేసీఆర్ ఖరాఖండీగా  చెప్పేశారు.

విత్తనాల నకిలీ  ముఠాలను కనిపెట్టాలని ఇంటెలిజెన్స్‌ ఐజీని కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. వెంటనే డీజీపీ కూడా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాలన్నారు. నకిలీపై తక్షణం రంగంలోకి దిగాలని సూచించారు. అంతే కాదు.. నకిలీ విత్తనాల ముఠాలను పట్టుకునే పోలీసు, వ్యవసాయశాఖల అధికారులకు బహుమతులు ఇస్తామన్నారు కేసీఆర్. అలాంటి వారిని గుర్తించి వారికి యాక్సిలరీ ప్రమోషన్లు, రాయితీలు, సేవా పతకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.

పోలీసుల శాఖ పటిష్ట నిఘాతో పాటు కల్తీని నివారించేందుకు  కఠిన నిబంధనలు కూడా అవసరమే అన్నారు కేసీఆర్. అందుకే అవసరమైన చట్టాలు సవరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను  ఆదేశించారు. సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తేవాలని  సీఎస్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ @ 730 : రెండేళ్ల పాలన .. మరొక చరిత్ర

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?

అల్లు అర్జున్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

రెండేళ్ల జగన్ పాలన.. అందరివాడా.. ? కొందరివాడా. ?

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>