PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan37223413-845f-4250-8e22-42fab3e60285-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan37223413-845f-4250-8e22-42fab3e60285-415x250-IndiaHerald.jpgఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బాధ్య‌తలు చేప‌ట్టి నేటి రెండేళ్లు.అయితే జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో అంద‌రూ సంతోషంగా ఉన్నారా అంటే లేర‌నే చెప్పాలి.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారం చేప‌ట్టిన త‌రువాత ఆయన తీసుకున్న కీల‌క నిర్ణ‌యం మూడు రాజ‌ధానులు.ప‌రిపాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం,న్యాయ‌రాజ‌ధానిగా కర్నూల్‌,శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించారు. అయితే మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున ఆందోళ‌న వ‌చ్చాయి.ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని అంటూ అమ‌రావ‌తి రైతులు నినాదాలు చేస్తూ 500 రోజులుగా ఆందోళన‌లుJagan{#}Yevaru;Andhra Pradesh;Reddy;Amaravati;Amaravathi;CM;central government;Petrolజ‌గ‌న్ @730 : అన్న పాల‌న‌లో అసంతృప్తులు ఎవరు ?జ‌గ‌న్ @730 : అన్న పాల‌న‌లో అసంతృప్తులు ఎవరు ?Jagan{#}Yevaru;Andhra Pradesh;Reddy;Amaravati;Amaravathi;CM;central government;PetrolSun, 30 May 2021 13:29:13 GMTఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బాధ్య‌తలు చేప‌ట్టి నేటి రెండేళ్లు.అయితే జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో అంద‌రూ సంతోషంగా ఉన్నారా అంటే లేర‌నే చెప్పాలి.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారం చేప‌ట్టిన త‌రువాత ఆయన తీసుకున్న కీల‌క నిర్ణ‌యం మూడు రాజ‌ధానులు.ప‌రిపాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం,న్యాయ‌రాజ‌ధానిగా కర్నూల్‌,శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించారు. అయితే మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున ఆందోళ‌న వ‌చ్చాయి.ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని అంటూ అమ‌రావ‌తి రైతులు నినాదాలు చేస్తూ  500 రోజులుగా ఆందోళన‌లు చేస్తున్నారు.అయితే ప్ర‌భుత్వం మాత్రం మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.శాశ‌స‌మండ‌లిలో మొద‌టిసారి బిల్లులు వీగిపోవ‌డంతో మ‌రోసారి శాస‌న‌మండ‌లిలో బిల్లులు ప్ర‌వేశ‌పెట్టాల‌ని చూసిన‌ప్ప‌టికి ఆందోళ‌న‌ల మ‌ధ్య స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది.ఆ త‌రువాత క‌రోనా తీవ్ర రూపం దాల్చ‌డంతో బిల్లుల ప్ర‌స్తావ‌న రాలేదు.కానీ ప్ర‌భుత్వం మాత్రం మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉందంటూ ప‌లువురు మంత్రులు వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు.అన్నీ బాగుంటే ఈ ఏడాది మే 6వ తేదీన వైజాగ్‌లో సీఎం త‌న కార్యాల‌యాన్ని ప్రారంభిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది.కానీ క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా ప్ర‌స్తుతానికి ఆ కార్య‌క్ర‌మం ప‌డిన‌ట్లు తెలుస్తుంది.
జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌లో అమ‌రావ‌తి రైతులు ఎక్క‌డా సంతోషంగా లేరు. ఏడాదిన్న‌ర‌గా వాళ్లు రోడ్డ‌పైనే ఉంటున్నారు.ఆందోళ‌న స‌మ‌యంలో పోలీసుల లాఠీ దెబ్బ‌లు తిన్నారు. 33వేల ఎక‌రాలు భూమిని ప్ర‌భుత్వానికి ఇచ్చి తాము ఇప్పుడు రోడ్డున‌ప‌డ్డామంటే భోరున ఏడుస్తున్నారు రాజ‌ధాని రైతులు.మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులపై ప్ర‌భుత్వం వ‌రాలు జ‌ల్లు కురిపించినా ఆచ‌ర‌ణ‌లో ఆ హామీలు ఎక్క‌డా అమలు కావ‌డంలేదు. ప్ర‌తిఏడాది రైతుభ‌రోసా కింద కేంద్ర ప్ర‌భుత్వంతో ఇచ్చే దానితో క‌లిపి 13500 రూపాయలు ఇస్తున్న‌ప్ప‌టికీ రైతులకు ఆ డ‌బ్బులు పురుగుమందుల‌కు స‌రిపోవ‌డంలేదు.దీనికి తోడు పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌లేదు.ఈ ఏడాది ర‌బీ పంట‌కు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది.ప్ర‌భుత్వం నిర్ధేశించిన విత్త‌నాల‌నే మాత్ర‌మే నారుపోయాల‌ని అధికారులు చెప్పిన‌ప్ప‌టికీ కొనుగోలు చేయ‌డంలో మాత్రం జాప్యం జ‌రిగింది.దీంతో జ‌గ‌న్ స‌ర్కార్‌పై రైతులు తీవ్ర‌స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు.
ఇటు మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు సైతం ప్ర‌భుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు.రెండేళ్ల‌లో నిత్య‌వ‌స‌ర‌వ‌స్తువుల ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. ప్ర‌స్తుతం లీట‌ర్ స‌న్‌ఫ్ల‌వ‌ర్ అయిల్ ధ‌ర 190 వ‌ర‌కు ఉంది.ఒక‌ప‌క్క క‌రోనాతో ఉపాధి లేక ఇబ్బందులు ప‌డుతుంటే నిత్య‌వ‌స‌ర‌వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యుల‌కు ఇబ్బందిగా మారింది.ఇటు పెట్రోల్ ధ‌ర‌లు కూడా రోజు పెరుగుతుండ‌టంతో సామాన్యుడుపై భారం ఎక్కువ‌గా ప‌డుతుంది.బైక్‌పై వ్యాపారం చేసుకునే వారు పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వారి వ్యాపారాల‌ను సైతం మానేసేప‌రిస్థితి ఏర్ప‌డింది.

జ‌గ‌న్ బాధ్య‌తలు చేప‌ట్టిన వెంట‌నే కొత్త ఇసుక పాల‌సీ పేరుతో ఇసుక కొర‌త సృష్టించారు.దీంతో భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికుల‌పై ఆ ప్ర‌భావం తీవ్ర‌స్థాయిలో ప‌డింది.తాపీ మెస్ర్తీల ద‌గ్గ‌ర నుంచి కూలీల వ‌ర‌కు రోజు ప‌స్తులుండాల్సిన ప‌రిస్థితి.కొంత‌మంది రోజువారీ కూలీలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.ఇసుక కొర‌త తీరుతుంద‌న్న స‌మ‌యంలో క‌రోన విజృంభించింది.దీంతో భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు దెబ్బ‌మీద దెబ్బ‌ప‌డింది.ఓ వైపు సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తూనే ప్ర‌భుత్వం  సామాన్యుడి న‌డ్డివిరుస్తుంది.అమ్మ‌వ‌డి,విద్యాదీవెన‌,వైఎస్ఆర్ రైతుభ‌రోసా,వాహ‌న‌మిత్ర పేరుతో చాలా మంది ల‌బ్ధిపొందుతున్నారు.కానీ దానికి రెండురెట్లు ఖ‌ర్చు ప్ర‌తి సామాన్యుడి ఇంట్లో అవుతుంది.కాబ‌ట్టి జ‌గ‌న్ పాల‌న‌లో అమ‌రావ‌తి రైతులు,సామాన్యులు,వ్యాపారులు అసంతృప్తిగానే ఉన్నారు.










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?

జగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>