Andhra Pradesh
oi-Rajashekhar Garrepally
హైదరాబాద్: నెల్లూరు జిల్లా కృష్టపట్నంకు చెందిన ఆనందయ్య మందుపై చినజీయర్ స్వామి స్పందించారు. ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవంటున్నారని, అంతేగాక, ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకని చినజీయర్ స్వామి ప్రశ్నించారు.
ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రిని చినజీయర్ స్వామి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో ఆయన మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు? అని అన్నారు. కరోనా సంక్షోభం సమయంలో వివాదాలకు తావివ్వకూడదని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు.

అలోపతి వైద్యాన్ని వ్యవస్థ అంగీకరించిందని, కానీ, మంచిన ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని చినజీయర్ స్వామి చెప్పారు. ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు? అన్నారు. ఒక వ్యక్తి చనిపోతుంటే ఆనందయ్య మందు ప్రాణం నిలబెడుతున్నప్పుడు ఎందుకు వివాదం అవుతోందని అన్నారు.
ఆనందయ్య మందుకు అనుమతులు రావొచ్చు: ఎమ్మెల్యే కాకాని
సోమవారం ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతులు రావచ్చని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయుష్ తుది నివేదిక కూడా సోమవారం ఇస్తారని ఆయుష్ కమిషనర్ రాములు కూడా చెప్పారని, సీఎం జగన్ కూడా ఈ మందు పై దృష్టి పెట్టారు అని తెలిపారు.
ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ప్రజలకు శుభవార్తే వస్తుందన్నారు. అనుమతులు లభించాక ఆనందయ్య మందు పంపిణీ చేస్తామన్నారు. ఇక ఆనందయ్యను నిర్బంధించారంటూ టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న… మరణాలు మాత్రం తగ్గడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
English summary
chinna jeeyar swamy on krishnapatnam Anandaiah medicine.