MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kamal-hassand0ae7b69-c501-4be6-9ce7-dd343758796d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kamal-hassand0ae7b69-c501-4be6-9ce7-dd343758796d-415x250-IndiaHerald.jpgవిశ్వనటుడు కమల్ హాసన్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. అతడు ఎంచుకునే సరికొత్త తరహా కథలే కారణం. ఎప్పటి కప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే కమల్ తనదైన నటన, డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అన్ని రకాల పాత్రల్లోనూ సినీ ప్రేమికులను మెప్పించిన కమల్ విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా నిలిచాడు. పేరుకి 6పదుల వయసు..kamal hassan{#}Kamal Hassan;Athadu;Tamil;shankar;Cinema;Darsakudu;Director;court;Lokesh;Lokesh Kanagarajఆ తర్వాతే ‘విక్రమ్’.. విశ్వనటుడి ప్లాన్ ఏంటో..?ఆ తర్వాతే ‘విక్రమ్’.. విశ్వనటుడి ప్లాన్ ఏంటో..?kamal hassan{#}Kamal Hassan;Athadu;Tamil;shankar;Cinema;Darsakudu;Director;court;Lokesh;Lokesh KanagarajSun, 30 May 2021 15:02:06 GMTవిశ్వనటుడు కమల్ హాసన్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. అతడు ఎంచుకునే సరికొత్త తరహా కథలే కారణం. ఎప్పటి కప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే కమల్ తనదైన నటన, డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అన్ని రకాల పాత్రల్లోనూ సినీ ప్రేమికులను మెప్పించిన కమల్ విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా నిలిచాడు. పేరుకి 6పదుల వయసు దాటినప్పటికీ జోరుమీద సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విశ్వనటుడు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్నాయి.


వాటిలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇండియన్2’ ఒకటి. అయితే ప్రస్తుతం ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ తన తదుపరి సినిమాను ప్రకటించడంతో పాటు ఆ సినిమా ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నాడు. ఈ తరుణంలో ‘ఇండియన్2’ మేకర్స్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఇండియన్2 ఎప్పుడు పూర్తవుతుందనేది ఆధారపడి ఉంది. దాంతో ఈ విషయంలో కోర్టు తీర్పు ఏమని ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



అయితే ప్రస్తుతం కమల్ తదుపరి సినిమా ‘విక్రమ్’ విషయంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాకు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహిస్తున్నాడు. లోకేష్ పనిచేసింది తక్కువ సినిమాలకే అయినా మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. వీరి కాంబోలో రానున్న ‘విక్రమ్’ గురించి ఇప్పటికే ఓ చిన్న టీజర్ కూడా వచ్చింది. ఈ టీజర్ సోషల్ మీడియాను ఓ ఊపుఊపేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు వేచి చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయంలో కొత్తగా ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. ‘ఇండియన్2’ పంచాయితీ పూర్తయిన తరువాతే ‘విక్రమ్’ పట్టాలెక్కుతుందట. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ @ 730 : వైసీపిలో హోదా తగ్గిన నాయకులు వీరే !

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>