PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan889d50b6-a50d-49fb-84cb-f8eaed2a9fdc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan889d50b6-a50d-49fb-84cb-f8eaed2a9fdc-415x250-IndiaHerald.jpgసీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న రెండేళ్ల పాల‌న‌లో ఉద్యోగుల‌కు పెద్ద పీట వేస్తున్నారు. వారి సంక్షేమం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను తీసుకొస్తున్నారు. త‌న మేనిఫెస్టోలో చెప్పిన‌ట్టు ఒక్కో డిపార్టుమెంటులోని ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెబుతున్నారు. గ‌త స‌ర్కారు హ‌యాంలో ఉన్న ఉద్యోగ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల పెండింగ్‌ల‌ను ఒక్క సంత‌కంలో క్లియ‌ర్ చేసేశారు జ‌గ‌న్‌. 2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు అప్పటి చంద్రబాబు ప్ర‌భుత్వం వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించకుండా బకాయిపెట్టింది. ఆ మొత్తాలనjagan{#}CM;RTC;CBN;Jagan;Andhra Pradesh;september;YCPజగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?jagan{#}CM;RTC;CBN;Jagan;Andhra Pradesh;september;YCPSun, 30 May 2021 13:00:00 GMTసీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న రెండేళ్ల పాల‌న‌లో ఉద్యోగుల‌కు పెద్ద పీట వేస్తున్నారు. వారి సంక్షేమం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను తీసుకొస్తున్నారు. త‌న మేనిఫెస్టోలో చెప్పిన‌ట్టు ఒక్కో డిపార్టుమెంటులోని ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెబుతున్నారు. గ‌త స‌ర్కారు హ‌యాంలో ఉన్న ఉద్యోగ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల పెండింగ్‌ల‌ను ఒక్క సంత‌కంలో క్లియ‌ర్ చేసేశారు జ‌గ‌న్‌.

2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు అప్పటి చంద్రబాబు ప్ర‌భుత్వం వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించకుండా బకాయిపెట్టింది. ఆ మొత్తాలని చెల్లించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులను గతంలోనే ఆదేశించారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు విడతలుగా చెల్లింపులు చేశారు ఆర్టీసీ అధికారులు. అలాగే మిగిలిన రెండు విడతలను ఈ నెలాఖరు నాటికి చెల్లించాలని నిర్ణయించారు. దీంతో 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు లాభం చేకూరనుంది.

అలాగే రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏను పెంచుతూ జగన్ సర్కారు శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాలామంది ఉద్యోగుల‌కు మేలు జ‌రిగింది. ఈ నిర్ణంయ‌పై ప‌లు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కాగా, పెంచిన డీఏను ఎప్పుడు చెల్లిస్తార‌నేది పూర్తి వివ‌రాల‌తో త్వ‌ర‌లోనే మ‌రో జీవో విడుద‌ల చేయ‌నుంది స‌ర్కార్‌.

ఇక ఇప్పుడు ఈ కరోనా క‌ష్ట కాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అండ‌గా నిలిచింది. ప్రభుత్వంలోని 8 శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లోనే ముగియ‌నుండ‌టంతో.. వారికి అండ‌గా నిలిచింది జగన్ సర్కార్. ఈ మేర‌కు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖల్లో ప‌నిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వారికి కూడా రెగ్యుల‌ర్ ఉద్యోగుల్లాగే జీతాలు చెల్లిస్తోంది వైసీపీ ప్ర‌భుత్వం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?

జగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?

సెల్ఫీ అడిగారని అభిమానిని నడిరోడ్డుపై దారుణం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>