MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aruguru-prathivatahlu-movie-heroin-amruthabb98eb7a-0454-4be9-84c4-75a0ed90fe81-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aruguru-prathivatahlu-movie-heroin-amruthabb98eb7a-0454-4be9-84c4-75a0ed90fe81-415x250-IndiaHerald.jpg2004 లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆరుగురు పతివ్రతలు సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ చిత్రాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దడంలో ఈవీవీ సత్యనారాయణ తప్పా మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన తీసిన ఎన్నో చిత్రాలు మనలను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి . ఫ్యామిలీ చిత్రాలలో ముఖ్యంగా చెప్పుకోదగిన చిత్రం "ఆరుగురు పతివ్రతలు". ఆరుగురి మహిళల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను తీసుకొని, సినిమా రూపంలో చిత్రీకరించడంలో ఈవీవీ సARUGURU PRATHIVATAHLU MOVIE HEROIN AMRUTHA{#}Cinema;Chitram;raj;amrutha;Kannada;Telugu"ఆరుగురు పతివ్రతలు" నటి ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా ?"ఆరుగురు పతివ్రతలు" నటి ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా ?ARUGURU PRATHIVATAHLU MOVIE HEROIN AMRUTHA{#}Cinema;Chitram;raj;amrutha;Kannada;TeluguSun, 30 May 2021 12:00:00 GMT
2004 లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆరుగురు పతివ్రతలు సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ చిత్రాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దడంలో ఈవీవీ సత్యనారాయణ తప్పా మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన తీసిన ఎన్నో చిత్రాలు మనలను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి . ఫ్యామిలీ చిత్రాలలో ముఖ్యంగా చెప్పుకోదగిన చిత్రం "ఆరుగురు పతివ్రతలు". ఆరుగురి మహిళల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను తీసుకొని, సినిమా రూపంలో చిత్రీకరించడంలో ఈవీవీ సత్యనారాయణ పడిన కష్టం ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అప్పట్లో భారీ సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పటికీ అప్పుడప్పుడు టీవీల్లో ప్రసారమవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో అమృత, విద్య, నీత, ఎల్.బి.శ్రీరామ్, చలపతిరావు,రవివర్మ,అజయ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రంలో ఇద్దరు మొగుళ్ళతో కలిసి కాపురం చేసేటువంటి వివాహిత పాత్రలో నటించి, ప్రేక్షకులను ఎంతగానో అలరించిన "అమృత" ఇప్పటికీ సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది. అయితే ఈ సినిమా తరువాత అమృత మళ్లీ సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు. కన్నడ పరిశ్రమకు చెందిన అమృత, ఆరుగురు పతివ్రతలు సినిమా తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ఈమెకు కన్నడలో మాత్రం అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి.

అయితే అనుకోకుండా అమెరికాలో ఇద్దరు దంపతులు చేయకూడని వ్యాపారం చేస్తున్నారని కేసులో అమృత పేరు కూడా వినిపించింది. ఇక దీంతో ఆమె కన్నడ ఇండస్ట్రీ కి కూడా దూరం అయింది. తెలుగు, తమిళ్, కన్నడ  ఇండస్ట్రీలలో అన్నీ కలిపి 10 వరకు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న అమృత, ఇక సినిమాలకు దూరంగానే ఉంటోంది. అయితే ఏది ఏమైనప్పటికీ కేవలం ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను బాగా పొంది, తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన నటులలో అమృత కూడా ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బింబిసారా తెరకెక్కడానికి ఎన్ని తిప్పలు..!!

జగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?

సెల్ఫీ అడిగారని అభిమానిని నడిరోడ్డుపై దారుణం..!!

జగన్ @ 730 : అన్న సినిమా కు చేసిందేంలేదు మరి !

యాంకర్స్ నుంచి హీరోయిన్స్ గా మారింది వీళ్ళే..?

ఆదివారం ఓటీటీ లలో ఈ సినిమా లు చూసి ఎంజాయ్ చేయండి!!

జగన్ @ 730 : 30 ఏళ్లు పాలించేలానే ఉందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>