MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mavichiguru-108c2b26-0ebb-434f-8d7a-9ed9094939dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mavichiguru-108c2b26-0ebb-434f-8d7a-9ed9094939dd-415x250-IndiaHerald.jpgక్లాస్ సినిమాల డైరెక్ట‌ర్ ఎస్వీ కృష్ణారెడ్డి అంటే మినిమ‌మ్ హిట్ గ్యారంటీ అనే విధంగా ఆయ‌న సినిమాలు ఉంటాయి. ఒక‌ప్పుడు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌నో సంచ‌ల‌నం. చిన్న పాయింట్ చుట్టూ సినిమాను న‌డుపుతూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు ఆయ‌న‌. అలాంటి ఆయ‌న డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన అద్భుత‌మైన సినిమా మావిచిగురు. ఈ సిన‌మా వ‌చ్చి నేటికి 25ఏళ్లు పూర్త‌వుతోంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ సినిమా అప్ప‌టికే రావ‌డంతో ‘మావిచిగురు’ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఫుల్ క్రేజ్ mavichiguru{#}SV museum;Telugu;Cinema;krishna reddy;Aamani;nirmalammaమావిచిగురు@25ఏళ్ళుమావిచిగురు@25ఏళ్ళుmavichiguru{#}SV museum;Telugu;Cinema;krishna reddy;Aamani;nirmalammaSun, 30 May 2021 18:00:00 GMTక్లాస్ సినిమాల డైరెక్ట‌ర్ ఎస్వీ కృష్ణారెడ్డి అంటే మినిమ‌మ్ హిట్ గ్యారంటీ అనే విధంగా ఆయ‌న సినిమాలు ఉంటాయి. ఒక‌ప్పుడు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌నో సంచ‌ల‌నం. చిన్న పాయింట్ చుట్టూ సినిమాను న‌డుపుతూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు ఆయ‌న‌. అలాంటి ఆయ‌న డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన అద్భుత‌మైన సినిమా మావిచిగురు. ఈ సిన‌మా వ‌చ్చి నేటికి 25ఏళ్లు పూర్త‌వుతోంది.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ సినిమా అప్ప‌టికే రావ‌డంతో ‘మావిచిగురు’ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఫుల్ క్రేజ్ నెలకొల్పింది. అందుకు తగ్గట్టుగానే మహిళాలోకాన్ని ఆకట్టుకొనే క‌థ‌తో ఎస్వీ కృష్నారెడ్డి సినిమాను రూపొందించారు. ఇక ‘మావిచిగురు’ కూడా విడుద‌లై పెద్ద విజయం సాధించింది.  ఈ సినిమా 1996 మే 30న విడుదలైన స‌క్సెస్ సాధించింది.

ఈ క‌థ‌లో భ‌ర్తంటే ప్రాణం ఇచ్చే ఓ మిడిల్ క్లాస్ మ‌హిల చుట్టూ స‌న్ని వేశాలు సాగుతాయి. తాను ఎక్కువ రోజులు బ‌త‌క‌న‌ని తెలుసుకుంటుంది హీరోయిన్‌. దీంతో తన భర్తకు మరో పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ, భార్యంటే ప్రాణంగా భావించే భ‌ర్త అందుకు ఒప్పుకోడు. ఇక తాను చ‌నిపోయేలోగా ఎలా అయినా భర్తను ఆమె ఎలా రెండో పెళ్ళికి ఒప్పించింది అన్నదే  ఈసినిమా.

ఇందులో న‌టించిన జగపతిబాబు, ఆమని అంత‌కు ముందు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘శుభలగ్నం’లో న‌టించి మెప్పించారు. అప్ప‌ట్లో ఈ జంట‌కు ఫుల్ క్రేజ్ ఉండేది. తన భర్తకు తాను దూరమైనా, ఓ తోడు ఉండే విధంగా చూడాల‌నే ఓ మ‌హిళ తాప‌త్ర‌యాన్ని కృష్ణారెడ్డి అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో రంజిత, బ్రహ్మానందం, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, ఆలీ, అల్లు రామలింగయ్య, శివాజీరాజా, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి, శివపార్వతి, నిర్మలమ్మ తదితరులు యాక్ట్ చేశారు. కృష్ణారెడ్డి సంగీతం అందించారు. ఈ సినిమాను శ్రీస్రవంతి మూవీస్, చంద్రకిరణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

" style="height: 563px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కళ్యాణ్ రామ్ అదే తప్పు చేస్తున్నాడు.. బింబిసారా కష్టమే..!!

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>