PoliticsDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganf062b60b-e2ea-470d-ba45-2d6c5fd86aa8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganf062b60b-e2ea-470d-ba45-2d6c5fd86aa8-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ సీఎం "వైయస్ జగన్మోహన్ రెడ్డి" గారు పాలన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే అంతలా ప్రజలలో నాటుకుపోయింది ఆయన పాలన. అంతే కాకుండా తన తండ్రి "వైయస్ రాజశేఖర్ రెడ్డి" చేసిన మంచి పనుల వల్ల తనకు అంత మంచి పేరు వచ్చిందంటూ అప్పుడప్పుడు చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి . వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2009 మే లో తొలిసారిగా కడప లోక్ సభ సభ్యులు గా ఎన్నికయ్యారు.JAGAN{#}రాజీనామా;2019;Andhra Pradesh;Father;dr rajasekhar;Dr. Rajasekhar;Reddy;Jagan;kadapa;CM;Chief Minister;Y. S. Rajasekhara Reddy;september;Congress;March;Wife;N. Chandrababu Naidu;Telugu Desam Party;November;Idupulapaya;Srikakulam;Party;YCP;polavaram;Polavaram Project;Government;Doctor;Arogyasri;sree;House;English mediumజగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?జగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?JAGAN{#}రాజీనామా;2019;Andhra Pradesh;Father;dr rajasekhar;Dr. Rajasekhar;Reddy;Jagan;kadapa;CM;Chief Minister;Y. S. Rajasekhara Reddy;september;Congress;March;Wife;N. Chandrababu Naidu;Telugu Desam Party;November;Idupulapaya;Srikakulam;Party;YCP;polavaram;Polavaram Project;Government;Doctor;Arogyasri;sree;House;English mediumSun, 30 May 2021 10:00:22 GMT
ఆంధ్ర ప్రదేశ్ సీఎం "వైయస్ జగన్మోహన్ రెడ్డి" గారు పాలన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే అంతలా ప్రజలలో నాటుకుపోయింది ఆయన పాలన. అంతే కాకుండా తన తండ్రి "వైయస్ రాజశేఖర్ రెడ్డి" చేసిన మంచి పనుల వల్ల తనకు అంత మంచి పేరు వచ్చిందంటూ అప్పుడప్పుడు చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి . వైయస్ జగన్ మోహన్ రెడ్డి  2009 మే లో తొలిసారిగా కడప లోక్ సభ సభ్యులు గా ఎన్నికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ దివగంత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 లో సెప్టెంబర్ 9న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన కుటుంబాలను, కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పు యాత్రకు అనుమతివ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీని వీడారు.2011 మార్చి 11న "వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని" స్థాపించారు. ఈ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు. అంతేకాకుండా 2011 మే లో జరిగిన ఉప ఎన్నికలలో మరలా కడప లోక్ సభ సభ్యునిగా 5.45 లక్షల ఓట్ల అత్యధిక మెజారిటీ తో గెలుపొందాడు. 2011లో  యువజన శ్రామిక రైతు( వైయస్సార్ ) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతి లో అతి స్వల్పంగా (1.25) పరాజయం పొంది, ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలా అయిదు ఏళ్ళు గడిచిన చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, వారి బాధలను వారి దగ్గరకే వెళ్లి తెలుసుకోవాలి అనుకొని " ప్రజా సంకల్ప యాత్ర" పేరుతో 2017 లో నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు.


"అన్న వస్తున్నాడు.. మంచి రోజులు వస్తున్నాయి".. అనే నినాదంతో ముందుకు సాగిస్తూ వెళ్లారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి . మొత్తం 13 జిల్లాల్లో పర్యటించి, చివరగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కి చేరుకున్నారు . మొత్తం 341 రోజుల పాటు..3,648 కిలోమీటర్లు నడిచి, అన్ని ప్రాంతాల్లో ప్రజలను స్వయంగా కలుసుకున్నారు. వారి కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ రాబోయేది మన ప్రభుత్వం. మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని భరోసానిస్తూ ముందుకు సాగారు. పాదయాత్రలో భాగంగా మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి 124 బహిరంగ సభలలో ఆయన ప్రసంగించారు.
జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను ముగించుకొని తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసనసభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శేషంగా 151 శాసన సభ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు స్థాయిలో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు అంతేకాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ అత్యధిక మెజారిటీ ( 90 వేలు ) సాధించిన శాసనసభ్యుడిగా కూడా రికార్డు సృష్టించాడు.ఆ సభలో వివిధ సామాజిక వర్గాలు, కుల వృత్తుల వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించి, పలు హామీలను ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే వైసీపీ ప్రధాన హామీలు, నవరత్నాలు గురించి తన పాదయాత్రలో విస్తృతంగా ప్రచారం చేశారు. చివరిగా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర గుర్తుగా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఇది జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు గుర్తుగా ఇచ్చాపురం ముఖద్వారంలోని లొద్దపుట్టి వద్ద భారీ స్థూపాన్ని వైసీపీ ఏర్పాటు చేసింది.


అయితే జగన్ మోహన్ రెడ్డి చెప్పిన విధంగా తన పాదయాత్రలో నవరత్నాల సైతం అన్నింటిని అమలుపరిచారు.


1). జగనన్న అమ్మ ఒడి: ప్రతి సంవత్సరం పేద పిల్లలకు 15 వేల రూపాయలు.
2). జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన : ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలు.
3). వైయస్సార్ జలయజ్ఞంలో: పోలవరం ప్రాజెక్టు ను డిసెంబర్, 2021నాటికి పూర్తి చేసి, 2022 ఖరీఫ్ కల్ల ఆయకట్టుకు సాగునీరు అందించడం.

4). మద్యపాన నిషేధం : మద్యపాన నియంత్రణ దిశగా తొలి అడుగులు వేసే లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషాలే లక్ష్యంగా, ప్రభుత్వం బెల్టుషాపులను అరికట్టి, ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహిస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
5). డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ : వైద్య ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తుందంటూ తీసుకొచ్చిన ఈ గొప్ప పథకం పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
6). వైయస్సార్ రైతు భరోసా : వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రూ.13,500 రైతుల ఖాతాల్లోకి పడతాయి.

7). వైయస్సార్ జగన్ ఇళ్ల పట్టాలు : రాష్ట్రవ్యాప్తంగా తన పాదయాత్ర లో చెప్పిన విధంగా ఇల్లు లేని ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇల్లు కట్టి ఇస్తానని చెప్పి దానిని ఐదేళ్లలో పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు. దాదాపుగా ఇప్పటికే 30 లక్షల 76 వేల ఇళ్ల స్థలాల పత్రాలను ఇచ్చారు.

8). వైయస్సార్ ఆసరా,వైయస్సార్ చేయూత : 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలను ఇస్తున్నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. తద్వారా వారు ఏదైనా పెట్టుబడి సహాయం కింద పెట్టుకొని, ఉపాధి మాదిరి చేసుకునే విధంగా కల్పించాడు.

9). వైయస్సార్ పింఛన్ కానుక : జగనన్న ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుండే పింఛన్లు నెలకు రూ.2,250 పెంచుతూ, దానిని రూ.మూడు వేల వరకు పెంచుతాం అని చెప్పుకొచ్చారు.ఇలాంటి నవరత్నాల అన్నీ తన పాదయాత్రలో చెప్పుకుంటూ వచ్చి తమదైన శైలిలో అందర్నీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా పాదయాత్ర నిమిత్తం తన దగ్గరకి వచ్చి చెప్పిన బాధలను పరిష్కరిస్తూ వెంటనే, వారికి ప్రయోజనం కలిగేలా చేసేవారు.

అంతేకాకుండా వైయస్సార్ వాహన మిత్ర,వైయస్సార్ నేస్తం, వైయస్సార్ కాపు నేస్తం, వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్సార్ ఉచిత పంట బీమా ఇలాంటి పథకాలు మరెన్నో అమలు చేస్తూ తను చెప్పిన దానికంటే ఎక్కువ చేసి వచ్చారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.


తన పాదయాత్రలో భాగంగా ప్రతి సమస్యను తెలుసుకొని, తన సీఎం అయిన వెంటనే వీటన్నింటినీ  పరిష్కరిస్తాం అంటూ చెప్పుకొచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అలా తను తయారుచేసి పెట్టుకున్న మేనిఫెస్టోలో ని 129 వాగ్దానాలకు గానూ 107 వాగ్దానాలు పూర్తిగా అమలు చేశాడు. మిగిలిన 15 వాగ్దానాలు ప్రారంభమై, వివిధ దశల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. తను రెండేళ్లు సీఎం పదవిలో, ఇప్పటికే 94.5 శాతం వాగ్దానాలు పూర్తిచేశారు.

అంతేకాకుండా పేద ప్రజలు వైద్యం అందక చనిపోతూ ఉండడంతో, వారికి ఉచితంగా వైద్యం అందించేలా కూడా చూస్తున్నారు. తను చేపట్టిన పథకాలను విమర్శకుల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ జగన్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఉచిత చదువు కూడా పేద ప్రజలకు అందించేలా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టాడు. అంతలా తన రెండేళ్ల పరిపాలనలలో ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తూ వస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చెప్పినవన్నీ, తన రెండేళ్ల పాలనలో  చేసినప్పటికీ,  కొన్ని వర్గాల ప్రజలు మాత్రం అసంతృప్తి కరంగానే ఉన్నారు. కానీ జగన్ పాలనలో చాలా మంది లబ్ధి పొందారని చెప్పవచ్చు. కానీ ప్రతిపక్ష  నాయకులు మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం షరా మామూలే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెల్ఫీ అడిగారని అభిమానిని నడిరోడ్డుపై దారుణం..!!

జగన్ @ 730 : అన్న సినిమా కు చేసిందేంలేదు మరి !

యాంకర్స్ నుంచి హీరోయిన్స్ గా మారింది వీళ్ళే..?

ఆదివారం ఓటీటీ లలో ఈ సినిమా లు చూసి ఎంజాయ్ చేయండి!!

జగన్ @ 730 : 30 ఏళ్లు పాలించేలానే ఉందా ?

జగన్ @ 730 : రెండేళ్ల పాలన .. మరొక చరిత్ర

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>