
కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే అధికం..
ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 16 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3263కి చేరింది. కొత్తగా నమోదైన కరోనా కేసులకంటే.. రికవరీనే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో 3660 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,37,522కు పెరిగింది.

35వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 35,042 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్యశాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.50 కోట్లకుకుపైగా నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93.34 శాతం ఉంది. మరణాల రేటు 0.56శాతంగా ఉంది. మరోవైపు తెలంగాణలో మరో పది రోజులపాటు లాక్‌డౌన్ పొడిగించారు. అయితే, 10 గంటల వరకు ఉన్న సడలింపులను ఒంటిగంట వరకు పెంచారు.

తెలంగాణ జిల్లాలవారీగా కరోనా కేసులు
ఇక తెలంగాణ జిల్లాలవారీగా కరోనా కేసులు గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 5, భద్రాద్రికొత్తగూడెంలో 75, జీహెచ్ఎంసీలో 390, జగిత్యాలలో 49, జనగాంలో 15, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 29, జోగులాంబగద్వాలలో 25, కామారెడ్డిలో 4, కరీంనగర్‌లో 92, ఖమ్మంలో 82, కొమురంభీంఅసిఫాబాద్‌లో 9, మహబూబ్ నగర్ 69, మహబూబాబాద్ లో 60, మంచిర్యాల్ 47, మెదక్ 15, మేడ్చల్ మల్కాజిగిరి 101, ములుగులో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 38, నల్గొండలో 45, నారాయణపేట్ 10, నిర్మల్‌లో 3, నిజామాబాద్‌లో 19, పెద్దపల్లిలో 68, రాజన్నసిరిసిల్లలో 26, రంగారెడ్డిలో 114, సంగారెడ్డిలో 68, సిద్దిపేటలో 76, సూర్యపేటలో 29, వికారాబాద్‌లో 50, వనపర్తిలో 55, వరంగల్ రూరల్‌లో 61, వరంగల్ అర్బన్ లో 54, యాదాద్రిభువనగిరి జిల్లాలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి.