Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagancc923175-69c9-45df-a08f-bb7da46505ef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagancc923175-69c9-45df-a08f-bb7da46505ef-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించి విజయం సాధించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచారు. ఇక ఇటీవలే రెండేళ్ళ పాలన పూర్తిచేసుకుని మూడవ ఏట పాలన లోకి అడుగుపెట్టారు సీఎం జగన్. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ రెండేళ్ళ పాలనలో... అటు యువకులను మాత్రం తనవైపుకు తిప్పుకునే లేకపోయారు. సJagan{#}2019;Andhra Pradesh;Assembly;Y. S. Rajasekhara Reddy;Party;CM;Jagan;vidya;jobజగన్ @ 730 : కుర్రాళ్ళ ఏడుపిదే !జగన్ @ 730 : కుర్రాళ్ళ ఏడుపిదే !Jagan{#}2019;Andhra Pradesh;Assembly;Y. S. Rajasekhara Reddy;Party;CM;Jagan;vidya;jobSun, 30 May 2021 12:30:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించి విజయం సాధించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత  ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచారు.  ఇక ఇటీవలే రెండేళ్ళ పాలన పూర్తిచేసుకుని మూడవ ఏట పాలన లోకి అడుగుపెట్టారు సీఎం జగన్. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ రెండేళ్ళ పాలనలో... అటు యువకులను మాత్రం తనవైపుకు తిప్పుకునే లేకపోయారు.



 సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్ అటు..  యువకులకు కావాల్సిన ఉద్యోగం, ఉపాధి విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నారు.  జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు.  పలు సంక్షేమ పథకాల ద్వారా వివిధ దశలలో చదువుకుంటున్న విద్యార్థుల మనసులు గెలిచిన జగన్.. యువకుల హృదయాలను మాత్రం గెలవలేకపోయారు. ఎందుకంటే సంక్షేమ పథకాల పేరుతో చదువుకుంటున్న సమయంలో ఉన్నత విద్య వరకు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలబడ్డారు జగన్.. కానీ చదువు పూర్తయిన తర్వాత  ఉద్యోగాల కోసం మాత్రం ఎక్కడా అండగా నిలబడిన దాఖలాలు లేవు.



 జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగి పోయింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని ఎన్నికల ముందు ప్రకటిస్తే యువకులు మురిసి పోయారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఊసేలేదు.  పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదు..  ఇక పారిశ్రామిక అభివృద్ధి కూడా ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువగా నమోదయింది.  ఇలా ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగం, ఉపాధి కల్పించడంలో.. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయడంలో జగన్ ప్రభుత్వం ఒక రకంగా విఫలం అయింది అని చెప్పాలి.  జగన్ ప్రభుత్వం నేటికీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికి తమకు సరైన ఉద్యోగ అవకాశాలు రాలేదని  ఎంతోమంది యువకులు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?

జగన్ @ 730 : పాలన బావుందా? పాదయాత్ర బావుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>