MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు మూవీతో హీరోగా పరిచయం అయి, ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టారు. ఆ విధంగా ఫస్ట్ మూవీ తోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కు తగ్గ తనయుడిగా మంచి క్రేజ్ దక్కించుకున్న మహేష్, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గరగా ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న మహేష్, ఇంతటి గొప్ప స్థాయికి రావడానికి కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మధ్యలో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న మహేష్, అక్కడక్కడా కొన్ని పరాజmahesh-babu{#}Mahesh;Rajani kanth;CBN;Blockbuster hit;Cinema;Father;krishna;Tollywood;Hero;mahesh babu;Fidaa;Heroine;bollywood;Sarileru Neekevvaru;Success;Rajamouli;India;Yevaruఆ విషయమై కలవరపెడుతున్న మహేష్ మౌనం ..... ??ఆ విషయమై కలవరపెడుతున్న మహేష్ మౌనం ..... ??mahesh-babu{#}Mahesh;Rajani kanth;CBN;Blockbuster hit;Cinema;Father;krishna;Tollywood;Hero;mahesh babu;Fidaa;Heroine;bollywood;Sarileru Neekevvaru;Success;Rajamouli;India;YevaruSun, 30 May 2021 21:01:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు మూవీతో హీరోగా పరిచయం అయి, ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టారు. ఆ విధంగా ఫస్ట్ మూవీ తోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కు తగ్గ తనయుడిగా మంచి క్రేజ్ దక్కించుకున్న మహేష్, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గరగా ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న మహేష్, ఇంతటి గొప్ప స్థాయికి రావడానికి కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మధ్యలో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న మహేష్, అక్కడక్కడా కొన్ని పరాజయాలతో కెరీర్ పరంగా పలు ఇబ్బందులను కూడా ఎదుర్కొనకతప్పలేదు.

ఇక ఇటీవల కొన్నాళ్లుగా వరుసగా విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్, ఇకపై కేరీర్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నారు. నిజానికి మహేష్ బాబు అందం, అభినయానికి ఫిదా అవ్వని ఆడియన్ ఉండడు అనే చెప్పాలి, ఇక అమ్మాయిల్లో మహేష్ కు ఉండే క్రేజ్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇక నార్త్ లో అయితే మహేష్ కు హీరోయిన్స్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడో ఫస్ట్ సినిమా తరువాతనే తనకు బాలీవుడ్ మూవీ ఆఫర్స్ వచ్చినప్పటికీ మహేష్ మాత్రం అక్కడ సినిమాలు చేయడానికి సుముఖత చూపలేదు. ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ తాను కెరీర్ లో ఎప్పటికీ బాలీవుడ్ మూవీస్ చేయను అంటూ మహేష్ చేసిన షాకింగ్ ప్రకటన ఆయన అభిమానగణాన్ని తీవ్ర సందిగ్ధంలో పడేసింది.

మహేష్ ని ఎప్పటికైనా బాలీవుడ్ లో చూడాలని ఎంతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఆయన పలికిన ఈ మాట అసలు రుచించలేదు. ప్రస్తుతం సర్కారు వారి పాట తరువాత మహేష్, రాజమౌళి తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కొన్ని వందల కోట్ల వ్యయంతో భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. అది కనుక సక్సెస్ అయితే దేశ విదేశాల్లో సైతం సూపర్ స్టార్ కి తిరిగలేని స్టార్డం రావడం ఖాయం. అయితే ఆ తరువాత మహేష్ కు అటు బాలీవుడ్ నుండి మరింతగా ఆఫర్స్ క్యూ కడతాయని మరి అటువంటి పరిస్థితుల్లో మహేష్ బాలీవుడ్ మూవీస్ చేస్తారా లేదా అనేది అందరినీ కన్ఫ్యూజన్ లో పడేస్తున్న ప్రశ్న. అయితే బాలీవుడ్ ఎంట్రీ విషయమై ఇటీవల ఎవరు తనని అడిగినా కూడా మౌనం వహిస్తూ వస్తున్న మహేష్, అప్పటికైనా మనసు మార్చుకుంటారో లేదో చూడాలి .... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది

బుడుగు: పిల్లలకు ముక్కు నుంచి రక్తం వస్తుందా..?

పనస పండు ఎవరు తినకూడదో తెలుసా?

రీల్ హీరోస్ ని మించిపోయిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా పుట్టుకలో కొత్త కోణం.. రూపకర్త అమెరికానేనట..

స్పోర్ట్స్ : ధోని వ్యక్తిత్వం గురించి రెండు మాటల్లో చెప్పిన కోహ్లీ..

జగన్ @ 730 : అభివృద్ది మాటేందన్యా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>