PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasena-03b76312-e9e5-41cc-b0e7-a100039c7764-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasena-03b76312-e9e5-41cc-b0e7-a100039c7764-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల్లో జనసేన పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఒకటి అంటే ఒకటే సీటు వచ్చింది. అటు పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. అయితే జనసేన ఓడిపోవడంతో పాటు, టీడీపీని కూడా ఓడించింది. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీకి బాగా నష్టం జరిగింది.janasena{#}2019;Janasena;Janasena Party;Pawan Kalyan;YCP;Kumaar;TDP;subba raju;subbaraju;Balakrishna;Congressఅక్కడ వైసీపీకి ప్లస్ అవుతున్న జనసేన..ఈసారి రూట్ మారుతుందా?అక్కడ వైసీపీకి ప్లస్ అవుతున్న జనసేన..ఈసారి రూట్ మారుతుందా?janasena{#}2019;Janasena;Janasena Party;Pawan Kalyan;YCP;Kumaar;TDP;subba raju;subbaraju;Balakrishna;CongressSun, 30 May 2021 00:00:00 GMTగత ఎన్నికల్లో జనసేన పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఒకటి అంటే ఒకటే సీటు వచ్చింది. అటు పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. అయితే జనసేన ఓడిపోవడంతో పాటు, టీడీపీని కూడా ఓడించింది. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీకి బాగా నష్టం జరిగింది.


అదే సమయంలో వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. ఇలా వైసీపీకి అడ్వాంటేజ్ అయిన నియోజకవర్గాల్లో ముమ్మిడివరం కూడా ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పొన్నాడ సతీశ్ కుమార్ పోటీ చేయగా, టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు పోటీ చేశారు. అనూహ్యంగా సుబ్బరాజుపై సతీశ్ దాదాపు 5 వేల ఓట్లపైనే మెజారిటీతో గెలిచారు.


అయితే ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు 33 వేలు అంటే ఏ రేంజ్‌లో ఓట్లు చీలిక జరిగిందో చెప్పాల్సిన పని లేదు. జనసేన తరుపున పితాని బాలకృష్ణ పోటీ చేశారు. అయితే బాలకృష్ణ గతంలో వైసీపీలో కీలక నాయకుడుగా ఉన్నారు. ఇక 2019 ఎన్నికల ముందు ఈయన వైసీపీని వీడి జనసేనలో చేరి ముమ్మిడివరం టిక్కెట్ దక్కించుకున్నారు.


దీంతో టీడీపీకి పడే ఓట్లు కూడా జనసేన చీల్చడంతో వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. అందుకే సతీశ్ తక్కువ మెజారిటీతో గెలిచేశారు. 2009లో ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ నుంచి సతీశ్ పోటీ చేసి, టీడీపీపై 1900 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రజారాజ్యంకు 41 వేల ఓట్లు వచ్చాయి.  ఆ విధంగా అప్పుడు ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన వల్ల ముమ్మిడివరంలో టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగింది.


అయితే 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన సపోర్ట్ చేయడం వల్ల, టీడీపీకి దాదాపు 30 వేల మెజారిటీ వచ్చింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ టీడీపీ-జనసేనలు కలిసి బరిలో ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. లేదంటే మళ్ళీ వైసీపీకే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.    




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..

టాలీవుడ్ కి బాహుబలి ఫోబియా .... ?

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>