PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-new-virus--------------e53057d5-a99b-4979-8c94-86f25478839e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-new-virus--------------e53057d5-a99b-4979-8c94-86f25478839e-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ముఖ్యంగా భారత్ లో విలయతాండవం చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో జనాలు కరోనాతో చనిపోతున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి ఎక్కడ పుట్టింది, ఎక్కడ నుంచి ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించింది అంటే అందరూ చెప్పే దేశం పేరు చైనా. గతేడాది చైనాను కరోనా మహమ్మారి వణికించింది. కానీ ఆ తర్వాత ఆ దేశంలో కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. మిగతా దేశాలను మాత్రం కరోనా వైరస్ ఇంకా వణికిస్తూనే ఉంది. తాజాగా చైనాలో ఓ కొత్త కరోనా వేరియంట్ వెలుగుచూడటం కలకలం రేపుతోందిchina new virus, చైనాలో కొత్తరకం స్ట్రెయిన్{#}Coronavirus;India;Governmentచైనాలో కొత్త కరోనా వేరియంట్..?చైనాలో కొత్త కరోనా వేరియంట్..?china new virus, చైనాలో కొత్తరకం స్ట్రెయిన్{#}Coronavirus;India;GovernmentSun, 30 May 2021 14:48:55 GMTకరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ముఖ్యంగా భారత్ లో విలయతాండవం చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో జనాలు కరోనాతో చనిపోతున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి ఎక్కడ పుట్టింది, ఎక్కడ నుంచి ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించింది అంటే అందరూ చెప్పే దేశం పేరు చైనా. గతేడాది చైనాను కరోనా మహమ్మారి వణికించింది. కానీ ఆ తర్వాత ఆ దేశంలో కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. మిగతా దేశాలను మాత్రం కరోనా వైరస్ ఇంకా వణికిస్తూనే ఉంది. తాజాగా చైనాలో ఓ కొత్త కరోనా వేరియంట్ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇదివరకు వెలుగుచూసిన స్ట్రెయిన్‌ లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలింది. దీంతో అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు.

చైనాలోని గాంజావ్‌ సిటీలో దాదాపు 1.5 కోట్ల మంది నివాసం ఉంటున్నారు. గత వారం రోజుల్లో అక్కడ 20 మందిలో కొత్త వేరియంట్ బయటపడింది. తాజాగా బయటపడిన కేసుల్లో కరోనా కొత్తరకం వేరియంట్‌ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. అప్రమత్తమైన ప్రభుత్వం ఆ ప్రాంతంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అందరూ ఇళ్లలోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కొత్త వేరియంట్ బయటపడడంతో లివాన్‌ జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. కొత్త వేరియంట్ ఉనికిని గుర్తించేందుకు పలు జిల్లాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లివాన్ జిల్లాలో మార్కెట్లు, రెస్టారెంట్లు మూసివేసి.. బహిరంగ కార్యక్రమాలపై, సాంస్కృతిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు.

రోజులు గడుస్తున్న కొద్దీ కరోనాలో కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. కరోనా చికిత్సకు ఎన్నో ఔషధాలు తయారు చేస్తున్నారు. కానీ కరోనా మహమ్మారి ఉధృతి మాత్రం తగ్గడం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ @ 730 : వైసీపిలో హోదా తగ్గిన నాయకులు వీరే !

ముక్కుపై గిర్రు గిర్రున బొంగరం.. వీడియో అదుర్స్

ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఆ ఒక్క సెలెబ్రిటీ ఎవరు ..?

బుల్లిపిట్ట : ఇకపై ఆధార్ ఈ సేవలను నిలిపివేత..

జగన్ @ 730 : అన్నకు అర్బన్ జనాలు ఇప్పటికీ దూరమేనా ?

జగన్ @ 730 : ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారా ?

జగన్ @ 730 : అన్న జనాల్లో హీరో - కోర్టుల్లో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>