PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ded10e6a-a913-42e1-ac8c-b95ca0a27afd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ded10e6a-a913-42e1-ac8c-b95ca0a27afd-415x250-IndiaHerald.jpgభారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, అదే సమయంలో పార్టీకి ఎంత మేలు జరుగుతుందనే కోణంలోనే జగన్ పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేసిన ప్రతి పథకం వల్ల ప్రజలు లబ్ది పొందారు. అదే సమయంలో పార్టీకి అడ్వాంటేజ్ అయింది.jagan{#}Jagan;YCP;local language;Government;TDP;CBN;Partyజగన్ కాన్సెప్ట్ బాబుకు నచ్చింది అనుకుంటా!జగన్ కాన్సెప్ట్ బాబుకు నచ్చింది అనుకుంటా!jagan{#}Jagan;YCP;local language;Government;TDP;CBN;PartySat, 29 May 2021 14:00:00 GMTభారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, అదే సమయంలో పార్టీకి ఎంత మేలు జరుగుతుందనే కోణంలోనే జగన్ పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం, అమలు చేసిన ప్రతి పథకం వల్ల ప్రజలు లబ్ది పొందారు. అదే సమయంలో పార్టీకి అడ్వాంటేజ్ అయింది.


ముఖ్యంగా జగన్ తీసుకున్న నిర్ణయంలో పార్టీకి బాగా కలిసొచ్చింది వాలంటీర్ వ్యవస్థ. ప్రతి కుటుంబానికి నేరుగా పథకాలు అందించాలనే ఉద్దేశంతో జగన్ ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమించారు. ఇక వైసీపీ తరుపున పనిచేసిన వారే ఎక్కువగా వాలంటీర్లు అయ్యారనే సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే వీరి వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో, పార్టీకి అంతే మేలు జరుగుతుంది.


వీరు ప్రజలకు నేరుగా పథకాలు అందిస్తున్నారు. అలాగే జగన్ ఏం చేస్తున్నారో ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతున్నారు. అసలు ఇటీవల లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో వైసీపీ భారీ విజయాలని అందుకోవడానికి ప్రధాన కారణం వాలంటీర్లే. ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్నవారి ఓట్లు చేజారిపోకుండా చూసుకున్నారు. ఫలితంగానే వైసీపీకి మంచి రిజల్ట్ వచ్చింది. అయితే జగన్ ప్రవేశపెట్టిన ఈ కాన్సెప్ట్ చంద్రబాబుకు నచ్చినట్లుంది. అందుకే ఆయన కూడా టీడీపీని బలోపేతం చేయడం కోసం ప్రతి 50 ఇళ్లకు ఓ టీడీపీ కార్యకర్తని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.


ప్రతి 50 ఇళ్లకు ఒక కార్యకర్తను నియమించి, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా ఉండాలని బాబు డిసైడ్ అయ్యారు. ఇలా 50 ఇళ్లకు ఓ కార్యకర్త పనిచేయడం వల్ల పార్టీ కూడా ప్రజల్లోకి వెళుతుందని, అప్పుడు ప్రజలతో సంబంధాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక పార్టీ కూడా బలోపేతం అవుతుందని అనుకుంటున్నారు. మొత్తానికైతే జగన్ కాన్సెప్ట్‌నే చంద్రబాబు ఫాలో అవుతున్నారు. మరి దీని వల్ల టీడీపీకి ఎంత లాభం జరుగుతుందో చూడాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆక్సిజన్ ట్యాంకర్ లో మంటలు...చివరికి..?

మంచిమాట : సాధన అంటే ఇలా వుండాలి..

మోడీని గంగలో ముంచిన సీఎం... పాపం...?

బుల్లి పిట్ట : వాట్సాప్ లో 3 రెడ్ టిక్ లు పడితే..?

వైసీపీలో ఇది కరెక్ట్ కాదు బ్రో...?

బర్త్ డే స్పెషల్: ఊహల పల్లకిలో ఊరేగించే గాయని 'ఉష'

పరిటాల ఫ్యామిలీకి ఆ ఛాన్స్ ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>