PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan8784dda6-40c3-4903-8b44-59cfca835062-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan8784dda6-40c3-4903-8b44-59cfca835062-415x250-IndiaHerald.jpgకడప జిల్లా అంటే వైసీపీ అడ్డా అనే సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే క్లీన్‌స్వీప్ చేసిన సరే ఈ జిల్లాకు ఒక్క మంత్రి పదవే దక్కింది. సీఎం జగన్ పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డిని పక్కనబెడితే, కడప జిల్లా నుంచి షేక్ అంజాద్ బాషా కేబినెట్‌లో ఉన్నారు.jagan{#}Jagan;kadapa;YCP;Minister;CM;Pulivendula;editor mohan;District;Deputy Chief Minister;Rayachoty;srikanthసొంత జిల్లాకు జగన్ ఇంకో ఛాన్స్ ఇస్తారా?సొంత జిల్లాకు జగన్ ఇంకో ఛాన్స్ ఇస్తారా?jagan{#}Jagan;kadapa;YCP;Minister;CM;Pulivendula;editor mohan;District;Deputy Chief Minister;Rayachoty;srikanthSat, 29 May 2021 04:00:00 GMTకడప జిల్లా అంటే వైసీపీ అడ్డా అనే సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే క్లీన్‌స్వీప్ చేసిన సరే ఈ జిల్లాకు ఒక్క మంత్రి పదవే దక్కింది. సీఎం జగన్ పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డిని పక్కనబెడితే, కడప జిల్లా నుంచి షేక్ అంజాద్ బాషా కేబినెట్‌లో ఉన్నారు.


కడప ఎమ్మెల్యేగా గెలిచిన అంజాద్ బాషాకు మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్‌విప్ ఇచ్చారు. ఇలా కీలక పదవులు ఉండటంతో కడప జిల్లాకు మరో పదవి దక్కలేదు. సీఎం, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ చీఫ్‌విప్‌లు కడప జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి, నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో మరో అవకాశం దక్కేలా కనిపించడం లేదు.


కాకపోతే జగన్ ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టారు. అయితే అప్పుడే మంత్రిగా ఛాన్స్ రానివారికి నెక్స్ట్ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేసి అవకాశం ఇస్తానని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిపోతుంది. ఇంకో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశముంది. ఇక అప్పుడు జగన్ పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం కల్పించవచ్చు.


ఒకవేళ పనితీరు ఆధారంగా కాకపోయినా సరే జిల్లాలు, కులాలు ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు చేయొచ్చు. ఇక అప్పుడు కడప జిల్లాలో ఏమన్నా మార్పులు రావొచ్చు. అలాగే కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించవచ్చు. లేదంటే జిల్లాకు మరో మంత్రి పదవి అదనంగా ఇవ్వొచ్చు. మరి కడప జిల్లా విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జిల్లాకు మరొక ఆఫర్ ఇస్తారా లేదా అంతటితో ఆపేస్తారో?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>