రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ నిలిపేసిన కేంద్రం -ఉత్పత్తి 10రెట్లు, లభ్యత పెరగడంతో..

National

oi-Madhu Kota

|

కరోనాకు సంబంధించి తరచూ ప్రోటోకాల్స్ మారుతుండటం, ఇప్పటికే కొవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగించగా, రేపో మాపో రెమ్‌డెసివిర్ ను కూడా తీసేస్తారనే వార్తన నడుమ ఆ ఇంజక్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఇది తొలగింపునకు సంబంధించింది కాదు..

 మోదీ.. నీ కాళ్లు మొక్కుతా, కక్ష మానుకో -సీఎస్ రీకాల్ రాష్ట్రాలకే అవమానం -బెంగాల్ సీఎం మమత సంచలనం మోదీ.. నీ కాళ్లు మొక్కుతా, కక్ష మానుకో -సీఎస్ రీకాల్ రాష్ట్రాలకే అవమానం -బెంగాల్ సీఎం మమత సంచలనం

కొవిడ్ రోగులకు అత్యవసర చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఇకపై రాష్ట్రాలకు సరఫరా చేయరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ఉత్పత్తి 10 రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు.

 Remdesivir Production Ramped Up 10 Times: Centre Halts State Allocation

రెమ్‌డెసివిర్ ఉత్పత్తి చేసే కంపెనీలు నెల రోజుల్లోనే 20 నుంచి 60కి పెరిగాయని, ఏప్రిల్ 11న రోజుకు 33 వేల వయల్స్ మాత్రమే ఉత్పత్తి కాగా, ఇప్పుడా సంఖ్య 3.50 లక్షలకు పెరిగిందని, కాబట్టి ఇప్పుడు వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. అత్యవసరాల కోసం మాత్రం కేంద్రం 50 లక్షల రెమ్‌డెసివిర్ వయల్స్‌ను సమకూర్చుకోవాలనుకుంటోందని మంత్రి వెల్లడించారు.

మోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూమోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూ

రెండో వేవ్ లో రోజువారీ కేసులు భారీగా వచ్చి, ఆస్పత్రులు నిండుకోవడం, క్రిటికల్ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో రెమ్‌డెసివిర్‌కు గత నెలలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఈ యాంటీ వైరల్ ఇంజక్షన్ ధరను తగ్గించిన ప్రభుత్వం రెమ్‌డెసివిర్, దాని తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దిగుమతి సుంకం మాఫీ అమలు ఈ ఏడాది అక్టోబరు 31 వరకు అమల్లో ఉంటుంది.

English summary

India has ramped up the production of anti-viral drug Remdesivir – used in the treatment of Covid patients – from 33,000 vials per day on April 11 to 3.5 lakh vials every day, the government has said. With the supply more than the demand, the central government will no longer allocate the anti-viral drug to the states, said Minister of State for Chemicals and Fertilizers Mansukh Mandaviya.

Story first published: Saturday, May 29, 2021, 19:26 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *