PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-719d77be-c00b-4454-9b9c-45f14ae3e4dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-719d77be-c00b-4454-9b9c-45f14ae3e4dd-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ చేతిలో ఇప్పుడు రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఉన్నాయి. మామూలుగానే రాప్తాడు నియోజకవర్గం పరిటాల ఫ్యామిలీనే చూసుకుంటుంది. రవీంద్ర చనిపోయాక ఈ నియోజకవర్గం నుంచి సునీత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. గత ఎన్నికల్లో సునీత పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు శ్రీరామ్‌ని నిలబెట్టింది.paritala{#}Ananthapuram;Anantapuram;paritala ravindra;Raptadu;Kollu Ravindra;Jagan;sriram;soori;Dharmavaram;YCP;Reddy;CBNపరిటాల ఫ్యామిలీకి ఆ ఛాన్స్ ఉందా?పరిటాల ఫ్యామిలీకి ఆ ఛాన్స్ ఉందా?paritala{#}Ananthapuram;Anantapuram;paritala ravindra;Raptadu;Kollu Ravindra;Jagan;sriram;soori;Dharmavaram;YCP;Reddy;CBNSat, 29 May 2021 12:00:00 GMTఅనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ చేతిలో ఇప్పుడు రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఉన్నాయి. మామూలుగానే రాప్తాడు నియోజకవర్గం పరిటాల ఫ్యామిలీనే చూసుకుంటుంది. రవీంద్ర చనిపోయాక ఈ నియోజకవర్గం నుంచి సునీత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. గత ఎన్నికల్లో సునీత పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు శ్రీరామ్‌ని నిలబెట్టింది.


కానీ జగన్ ‌వేవ్‌లో శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక రాప్తాడు బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో రాప్తాడు పక్కన ఉన్న ధర్మవరంలో ఓడిపోయిన వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్ళడంతో ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా పరిటాల ఫ్యామిలీకే అప్పగించారు. ఇలా పరిటాల ఫ్యామిలీ రాప్తాడు, ధర్మవరం బాధ్యతలు చూసుకుంటున్నారు. రెండుచోట్ల శ్రీరామ్ యాక్టివ్‌గా తిరుగుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.


అయితే రెండుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు బలంగానే ఉన్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి దూకుడుగా ఉంటున్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. అటు రాప్తాడులో కూడా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ మంచి విజయాలే సాధించింది. అసలు టీడీపీకి పెద్ద ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడైతే వైసీపీ బలంగానే ఉంది కాబట్టి, పరిటాల ఫ్యామిలీకి రెండు నియోజకవర్గాలపై పూర్తి పట్టు దక్కలేదు.


అయితే వచ్చే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పరిటాల ఫ్యామిలీనే నిలబడుతుందా వేరే వాళ్ళకు అవకాశం ఇస్తారనేది క్లారిటీ లేదు. రాప్తాడు బరిలో ఎలాగో పరిటాల ఫ్యామిలీనే నిలబడుతుంది. అటు ధర్మవరంలో పరిస్తితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఎన్నికల వరకు ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీకి అప్పగించి, ఎన్నికల సమయంలో మరో నాయకుడుని అక్కడ పోటీలో పెడతారా లేదా అనేది చంద్రబాబు చేతుల్లో ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండుచోట్ల పరిటాల ఫ్యామిలీ పోటీలోనే ఉంటే బెటర్ అని తమ్ముళ్ళు చెబుతున్నారు. రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేస్తే టీడీపీకి కలిసొస్తుందని అంటున్నారు. మరి చూడాలి రెండుచోట్ల పరిటాల ఫ్యామిలీకి ఛాన్స్ వస్తుందేమో?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య మందుకు అనుమతులు లాంఛనమే?

పెళ్ల‌య్యాక కూడా శ్రియ జోరు తగ్గలేదు..!

తారుమారు అయిన ఈ హీరోల సినిమాలు..?

కరోనా సెకండ్ వేవ్.. ఇన్ని మరణాలు ఎందుకు.. అసలు విషయం చెప్పిన ఐసీఎంఆర్?

మనీ : తక్కువ పెట్టుబడితో ఐడియా అదిరింది గురూ..!

18 పేజెస్ అప్‌డేట్.. అదిరిపోయే లుక్స్‌లో నిఖిల్..?

పెళ్లి తర్వాత కూడా సినిమాలతో దుమ్మురేపుతున్న కాజల్ ఆగర్వాల్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>