MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/byreddy-1404368b-0531-4dce-826c-39d1884b8923-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/byreddy-1404368b-0531-4dce-826c-39d1884b8923-415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా జరుగుతున్న నియోజకవర్గం ఏదంటే నందికొట్కూరు అని ఠక్కున చెప్పేయొచ్చు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేసిన తొగురు ఆర్థర్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్ధి బండి జయరాజుపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆర్థర్ గెలుపుకు యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ బాగానే కృషి చేశారు.byreddy{#}2019;MLA;Nandikotkur;Assembly;YCP;TDP;Siddharth;Byreddy Siddharth Reddy;District;Minister;Kumaar;Raccha;local language;Panchayati;court;Y. S. Rajasekhara Reddyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ లీడింగ్ బైరెడ్డిదేనా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ లీడింగ్ బైరెడ్డిదేనా?byreddy{#}2019;MLA;Nandikotkur;Assembly;YCP;TDP;Siddharth;Byreddy Siddharth Reddy;District;Minister;Kumaar;Raccha;local language;Panchayati;court;Y. S. Rajasekhara ReddySat, 29 May 2021 05:00:00 GMTఅధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా జరుగుతున్న నియోజకవర్గం ఏదంటే నందికొట్కూరు అని ఠక్కున చెప్పేయొచ్చు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేసిన తొగురు ఆర్థర్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్ధి బండి జయరాజుపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆర్థర్ గెలుపుకు యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ బాగానే కృషి చేశారు.


తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్థర్ నిదానంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. అయితే నియోజకవర్గంలో ఈయన మాట కంటే నియోజకవర్గ సమన్వయకర్త siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాటనే ఎక్కువ చెల్లుబాటు అవుతుంది. నియోజకవర్గంలో బైరెడ్డి చెప్పిన విధంగానే పనులు జరుగతాయి. అధికారులు బైరెడ్డి మాటకే ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. ఇక జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌గానీ, వైసీపీ పెద్దలు గానీ సిద్ధార్థ్‌కే మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.


దీంతో ఆర్థర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పేశారు. అయితే బైరెడ్డి ఆధిపత్యం ఇష్టపడని ఆర్థర్ వర్గం, ఎక్కడికక్కడ బైరెడ్డి వర్గం చేసే పనులని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఇప్పటికే ఈ రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి కూడా. అయితే వైసీపీ అధిష్టానం వీరి పంచాయితీని సర్దిపుచ్చడానికి ప్రయత్నించినా, నిత్యం నియోజకవర్గంలో ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపిణీలో కూడా ఇరు వర్గాల మధ్య రగడ జరిగింది. అటు స్థానిక పదవుల విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి.


అయితే ఆర్థర్ గానీ, సిద్ధార్థ్ గానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, హాస్పిటల్స్ బాగుపడ్డాయి. అటు పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మంచి విజయాలు అందుకుంది. ఇక ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నందికొట్కూరు నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది తప్ప.. అభివృద్ధి మాత్రం అటకెక్కింది. రోడ్డు విస్తరణ పనుల్లో దుకాణాలు కోల్పోయిన బాధితులు పరిహారం కోసం కోర్టు మెట్లు ఎక్కటంతో... రోడ్డు వెడల్పు పనులకు బ్రేక్ పడింది. నాలుగేళ్లుగా రహదారులు, డ్రైనేజీలు, డివైడర్ల ఏర్పాటు జరగలేదు.


డివైడర్ల ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు కేటాయించామంటూ స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ ప్రకటించినా... నిర్మాణ పనులు ఏ మాత్రం ముందుకు కదల్లేదు. అటు రూరల్‌లో కొన్ని గ్రామాల్లో రోడ్ల వసతి సరిగ్గా లేదు. అలాగే నియోజకవర్గంలో పలుచోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి.


ఇక రాజకీయంగా చూసుకుంటే నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉంటే, అనధికార ఎమ్మెల్యేగా siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీకి పెద్ద స్కోప్ లేదు. వైసీపీలో విభేదాలు ఉన్నా సరే వాటిని ప్లస్‌గా మార్చుకుని టీడీపీ రాజకీయం చేయలేకపోతుంది. అటు బీజేపీలో ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి నియోజకవర్గంలో బలమైన వాయిస్ వినిపిస్తోంది. సమస్యలపై బాగానే పోరాటం చేస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సొంత జిల్లాకు జగన్ ఇంకో ఛాన్స్ ఇస్తారా?

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>