PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan9e118832-4fd1-41e4-a9d4-58eb5ab242aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan9e118832-4fd1-41e4-a9d4-58eb5ab242aa-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో ఏపీ నుంచి రోగులు హైదరాబాద్ కు పోటెత్తుతున్నారు. అత్యవసర వైద్యం, అత్యాధునిక వైద్యం కోసం జనం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. అయితే ముందు మా తెలంగాణ వాళ్లకు పడకలు దొరకొద్దా అంటూ కేసీఆర్ సర్కారు మొదట్లో అంబులెన్సులను సైతం ఆపేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక జగన్.. ఏపీలోనే మెరుగైన వైద్యం అందించాలి అంటున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలకు వైద్యం కోసం ప్రజలు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ఆలోచన చేయాలంటున్న జగన్.. అందుకు పరిష్కారంగా రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు చేయjagan{#}Andhra Pradesh;Hyderabad;Telangana;KCR;Episode;Rajahmundry;Jagan;CM;Chief Minister;Government;District;Arogyasriహైదరాబాద్ వెళ్లకుండా చేయాలన్న జగన్..?హైదరాబాద్ వెళ్లకుండా చేయాలన్న జగన్..?jagan{#}Andhra Pradesh;Hyderabad;Telangana;KCR;Episode;Rajahmundry;Jagan;CM;Chief Minister;Government;District;ArogyasriSat, 29 May 2021 06:00:00 GMTకరోనా సమయంలో ఏపీ నుంచి రోగులు హైదరాబాద్ కు పోటెత్తుతున్నారు. అత్యవసర వైద్యం, అత్యాధునిక వైద్యం కోసం జనం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. అయితే ముందు మా తెలంగాణ వాళ్లకు పడకలు దొరకొద్దా అంటూ కేసీఆర్ సర్కారు మొదట్లో అంబులెన్సులను సైతం ఆపేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక జగన్.. ఏపీలోనే మెరుగైన వైద్యం అందించాలి అంటున్నారు.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలకు వైద్యం కోసం ప్రజలు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ఆలోచన చేయాలంటున్న జగన్.. అందుకు పరిష్కారంగా రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలని, నెల రోజుల్లో ఈ పాల‌సీని తీసుకురావాల‌ని జగన్ అధికారులను ఆదేశించారు. ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

హెల్త్‌ హబ్‌ల కోసం సేకరించిన భూముల్లో ఒక్కో ఆస్పత్రికి ఐదు ఎకరాలు కేటాయించాలని సీఎం జగన్  ఆదేశించారు. మూడేళ్లలో రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలన్నారు. దీని వల్ల కనీసం 80కి పైగా మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేట్‌ రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయన్నారు.

హెల్త్‌ హబ్స్‌ పాలసీ వల్ల ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లలో మల్టీస్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయని.. టెరిషరీ కేర్‌ మెరుగుపడితే ఇతర ప్రాంతాల్లో వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని జగన్ అంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి వైద్యం అందుతుందన్నారు. అంతే కాదు..ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ తయారయ్యేలా విధానం తీసుకురావాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. అంతా బాగానే ఉంది. కానీ.. అమలే కదా అసలు సమస్య. చెప్పినట్టు చేయగలిగితే జగన్ ప్రజల ప్రాణాలు కాపాడిన దేవుడే అవుతారు.  
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>