PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-chandrababud148ffbf-ab49-42cb-8cbb-115af1814ae9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-chandrababud148ffbf-ab49-42cb-8cbb-115af1814ae9-415x250-IndiaHerald.jpgఅవి తెలంగాణ ఏర్పడిన తొలి రోజులు.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచే రెండు రాష్ట్రాల పాలన సాగుతున్న రోజులు.. అనూహ్యంగా ఓటుకు నోటు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కోసం ఏకంగా 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చేందుకు ఆనాటి తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లిన వీడియోలు బయటకు వచ్చాయి. అంతేనా.. ఏకంగా స్టీఫెన్‌ సన్‌తో తెలుగు దేశం అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్‌ మీ అంటూ మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చేశాయి. రాజకీయంగా అదో పెను సంచలనం. ఆ తర్వాkcr-chandrababu{#}Telangana;Hyderabad;MLA;Revanth Reddy;Telugu Desam Party;CBN;KCR;Telangana Rashtra Samithi TRS;Smart phone;Thief;Donga;Anti-Corruption Bureau;Modi;Amaravati;Amaravathiకేసీఆర్..! ఆ కేసు నుంచి బాబును కాపాడిన బ్రహ్మదేవుడెవరో..?కేసీఆర్..! ఆ కేసు నుంచి బాబును కాపాడిన బ్రహ్మదేవుడెవరో..?kcr-chandrababu{#}Telangana;Hyderabad;MLA;Revanth Reddy;Telugu Desam Party;CBN;KCR;Telangana Rashtra Samithi TRS;Smart phone;Thief;Donga;Anti-Corruption Bureau;Modi;Amaravati;AmaravathiSat, 29 May 2021 00:00:00 GMTఅవి తెలంగాణ ఏర్పడిన తొలి రోజులు.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచే రెండు రాష్ట్రాల పాలన సాగుతున్న రోజులు.. అనూహ్యంగా ఓటుకు నోటు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కోసం ఏకంగా 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చేందుకు ఆనాటి తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లిన వీడియోలు బయటకు వచ్చాయి. అంతేనా.. ఏకంగా స్టీఫెన్‌ సన్‌తో తెలుగు దేశం అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్‌ మీ అంటూ మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చేశాయి. రాజకీయంగా అదో పెను సంచలనం.

ఆ తర్వాత ఈ వివాదంపై అటు చంద్రబాబు, కేసీఆర్ సవాళ్లు విసురుకున్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని టీఆర్ఎస్ నేతలు అంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేసీఆర్ సర్కారు కూలిపోతుందని తెలుగు దేశం నేతలు వార్నింగులు ఇచ్చుకున్నారు. చంద్రబాబు పచ్చిగా దొరికిన దొంగ అని.. ఆయన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని సాక్షాత్తూ కేసీఆర్ కామెంట్ చేశారు. నీకు ఏసీబీ ఉంది.. నాకు ఏసీబీ ఉంది చూసుకుందామని చంద్రబాబు సవాల్ చేశారు.

మొత్తానికి ఈ వివాదం క్రమంగా చల్లబడింది. మోడీ స్థాయి నేతలు కలుగు చేసుకుని రాజీ కుదిర్చారని అంటారు. ఏదేమైనా ఈ ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు అకస్మాత్తుగా విజయవాడకు రాజధానిని తరలించారు. కనీసం కార్యాలయాలకు బిల్డింగులు లేకపోయినా సరే.. అత్యవసరంగా విజయవాడకు పాలన తరలించారు. ఆ తర్వాత అమరావతి నిర్మాణంపై దృష్టి సారించారు.

ఆ తర్వాత ఈ ఓటుకు నోటు కేసు విచారణ మాత్రం నత్తనడకన సాగుతూనే ఉంది. మొత్తం మీద ఇన్నాళ్లకు ఈ కేసులో ఈడీ చార్జ్‌షీటు దాఖలు చేసింది. విచిత్రం ఏంటంటే.. ఈ చార్జ్ షీటులో ఎక్కడా చంద్రబాబు పేరు మాత్రం లేదు. అంటే ఓ విధంగా చంద్రబాబుకు ఈ కేసు నుంచి క్లీన్ చిట్ లభించినట్టే. మరి అప్పట్లో చంద్రబాబును ఏ బ్రహ్మ దేవుడూ కాపాడలేడని సాక్షాత్తూ కేసీఆరే అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబును ఏ బ్రహ్మదేవుడు కాపాడారో.. ఏ రాజకీయం పని చేసిందో.. అంతా లోగుట్టు పెరుమాళ్లకెరుక.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ విషయంలో బాబుని వదిలేలా లేరుగా!

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>