MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-9aa27e99-63e7-46ce-b4ba-13f0577b3b8a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-9aa27e99-63e7-46ce-b4ba-13f0577b3b8a-415x250-IndiaHerald.jpgక‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. అయితే కరోనాకు ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన‌ మందులు అందుబాలులో లేక‌పోవ‌డంతో ఎంతోమంది మ‌ర‌ణిస్తున్నారు. అంతే కాకుండా ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వెళితే వారు వేసే బిల్లుల‌కే ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఏపీలోని కృష్ణ ప‌ట్నం కు చెందిన నాటు వైద్యుడు ఆనంద‌య్య ఓ మందును త‌యారు చేశారు. అది కరోనాను త‌గ్గిస్తుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌టంతో దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం గా మారింది. మందు వేసుకున్నవారు మీడియా ముందుకు వ‌చ్చి త‌మ‌కు పూర్తిగా క‌రోనా త‌గ్గిపోయింద‌ని చెప్ప‌డంతో కృష్న‌ప‌ట్నంకు కరోbalayya{#}krishna;media;NTR;nandamuri taraka rama rao;Mandula;Teluguఆనంద‌య్య మందుపై నాకు న‌మ్మ‌కముంది.. !ఆనంద‌య్య మందుపై నాకు న‌మ్మ‌కముంది.. !balayya{#}krishna;media;NTR;nandamuri taraka rama rao;Mandula;TeluguFri, 28 May 2021 17:29:37 GMTక‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. అయితే కరోనాకు ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన‌ మందులు అందుబాలులో లేక‌పోవ‌డంతో ఎంతోమంది మ‌ర‌ణిస్తున్నారు. అంతే కాకుండా ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వెళితే వారు వేసే బిల్లుల‌కే ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఏపీలోని కృష్ణ ప‌ట్నం కు చెందిన నాటు వైద్యుడు ఆనంద‌య్య ఓ మందును త‌యారు చేశారు. అది కరోనాను త‌గ్గిస్తుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌టంతో దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం గా మారింది. మందు వేసుకున్నవారు మీడియా ముందుకు వ‌చ్చి త‌మ‌కు పూర్తిగా క‌రోనా త‌గ్గిపోయింద‌ని చెప్ప‌డంతో కృష్న‌ప‌ట్నంకు కరోనా బాధితులు భారీగా త‌ర‌లివెళుతున్నారు. మ‌రోవైపు కొంతమంది ఆనంద‌య్య మందుకు వ్యతిరేఖంగా మాట్లాడుతుండగా మ‌రికొంద‌రు స‌పోర్ట్ చేస్తున్నారు. కాగా ఈ రోజు నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న బాల‌య్య‌కు మీడియా ఇదే ప్ర‌శ్న‌వేసింది. ఆనంద‌య్య మందుపై మీ అభిప్రాయం ఏంట‌ని అడ‌గ్గా బాల‌య్య ఆస‌క్తిక‌రంగా స్పందించారు...క్రిష్ణ‌ప‌ట్నం మందుపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని బాల‌య్య అన్నారు. త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని ఆయుర్వేధం అంటే అభిమానమ‌ని అన్నారు. 

అభిమానం లేనిదే ఆరాధ‌న లేద‌ని ఆరాధ‌న లేనిదే మతం లేద‌ని మతం లేనిదే మాన‌వుడే లేడ‌ని బాల‌య్య వ్యాఖ్యానించారు. కాబ‌ట్టి తాను త‌ప్ప‌కుండా న‌మ్ముతాన‌ని అన్నారు. మ‌న‌వాళ్ల‌లో గొప్ప గొప్ప‌వాళ్లు ఉన్నార‌ని కానీ మ‌నం దాన్ని ఒప్పుకోమని అన్నారు. క్రీస్తు పూర్వం శుశ్రుతుడు అనే వైద్యుడు ఉండేవాడ‌ని ఆస్ట్రేలియాలోని మెడిక‌ల్ కాలేజిలో ఆయ‌న విగ్ర‌హం ఉంద‌ని అన్నారు. మ‌న‌వాళ్ల‌ను మ‌నం గుర్తించుకోమ‌ని అన్నారు. గండిపేట‌లో విశ్వ‌నాథ శాస్త్రిగారు ఉండేవారిని ఆయ‌న‌ను నాజీలు డ‌బ్బులిచ్చి తీసుకువెళ్లారని అన్నారు. మ‌న వేదాలు మ‌నిషి యొక్క శ‌రీర నిర్మాణం మ‌రియు వాడాల్సిన మందుల గురించి తెలిపాయ‌ని అన్నారు. రాజ‌మండ్రిలో కూడా ఒక‌రు ఆయుర్వేదం చేస్తున్నార‌ని అన్నారు. త‌న‌కు కూడా ఆయుర్వేదం గురించి కొంత తెలుసున‌ని అన్నారు. అంతే కాకుండా వ‌చ్చే యేడాది రామారావుగారి శ‌త‌జ‌యంతి ఉంటుంద‌ని...ఆయ‌న మ‌ర‌ణించి ఇంత కాల‌మైనా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉన్నార‌ని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కూ రామారావు మ‌న‌తోనే ఉంటార‌ని బాల‌య్య వ్యాక్యానించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ అనుకుని ఎత్తుకెళ్లారు.. కానీ చివరికి?

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??

వివాదంలో బ్ర‌హ్మంగారి పీఠం.. ?

క‌రోనా వేళ అండ‌గా ఆర్ఎస్ఎస్ .. ఏ చేస్తున్నారంటే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>