MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/veata-movie956fbe04-d401-4113-8b6d-dde42d7d7e97-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/veata-movie956fbe04-d401-4113-8b6d-dde42d7d7e97-415x250-IndiaHerald.jpgఒకప్పుడు హిట్ కొట్టిన కాంబినేషన్లో మరో సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోతే ఫ్లాప్ అవ్వడం తో పాటు అభిమానులు కూడా నిరాశ చెందడం ఖాయం. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి నటించిన "వేట" సినిమా గురించి చెప్పుకుందాం. వేట సినిమా 1986 వ సంవత్సరంలో మే 28 న అంటే, ఈ రోజున ఈ చిత్రం విడుదల అయింది అన్నమాట. నేటితో సరిగ్గా ఈ సినిమా విడుదల అయ్యి 35 ఏళ్ళు పూర్తి కావడం విశేషం. అయితే సినిమా విశేషాల్లోకి వెళితే, దర్శకుడు కోదVEATA MOVIE{#}Cinema;Chiranjeevi;Chitram;Director;Darsakudu;Khaidi.;Khaidi newచిరంజీవి నటించిన ఆ సినిమాకి 35 ఏళ్ళు !చిరంజీవి నటించిన ఆ సినిమాకి 35 ఏళ్ళు !VEATA MOVIE{#}Cinema;Chiranjeevi;Chitram;Director;Darsakudu;Khaidi.;Khaidi newFri, 28 May 2021 21:00:00 GMT
ఒకప్పుడు హిట్ కొట్టిన కాంబినేషన్లో  మరో సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోతే ఫ్లాప్ అవ్వడం తో పాటు అభిమానులు కూడా నిరాశ చెందడం ఖాయం. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి నటించిన "వేట" సినిమా గురించి చెప్పుకుందాం.



వేట సినిమా 1986 వ సంవత్సరంలో మే 28 న అంటే, ఈ రోజున ఈ చిత్రం విడుదల అయింది అన్నమాట. నేటితో సరిగ్గా ఈ సినిమా విడుదల అయ్యి 35 ఏళ్ళు పూర్తి కావడం విశేషం. అయితే సినిమా విశేషాల్లోకి వెళితే, దర్శకుడు కోదండరామిరెడ్డి - చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "ఖైదీ" . ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్టయ్యింది. అంతేకాకుండా చిరంజీవి కెరియర్ నే మలుపు తిప్పిన సినిమా ఇదే.


మళ్లీ మూడేళ్ల తర్వాత ఇదే కాంబినేషన్లో "వేట" అనే పవర్ఫుల్ టైటిల్ తో మరో  సినిమా వచ్చింది. ఈ సినిమా  పట్ల భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక కలెక్షన్స్ పరంగా బాగా రాణిస్తుంది అని అనుకుంటే,  బాక్సాఫీసు దగ్గర చిరు వేట ఫలించలేకపోయింది. సినిమా చాలా కొత్తగా ఉంటుందనుకున్న  బయ్యర్లకు ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. అంతేకాకుండా ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి వెక్కివెక్కి ఏడ్చారట.

మెగాస్టార్ చిరంజీవి ఒక సందర్భంలో మాట్లాడుతూ.."నా కెరియర్ ను  మలుపు తిప్పిన సినిమా "ఖైదీ" . ఇది 1983లో  విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా నాకు ఎంతో క్రేజ్ ను కూడా తెచ్చిపెట్టింది. దీంతో అదే కాంబినేషన్ లో  "వేట" సినిమా చేశాం. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వేట సినిమా కూడా ఖైదీ  సినిమా లాగే మంచి హిట్ అవుతుందని నేను చాలా ఆశ పడ్డాను. కానీ నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. వేట సినిమా ఫ్లాప్ అవ్వడం నన్ను కలిచివేసింది. ఆ బాధ తట్టుకోలేక నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని మరీ వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ బాధ నుంచి బయటికి రావడానికి నాకు చాలా రోజుల సమయం  పట్టింది." అంటూ కామెంట్ చేశారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>